సిమి వ్యాలీలో సీతారాముల కళ్యాణ వైభోగం

August 13, 2020

గత మూడేళ్లుగా సిమి వ్యాలీ పరిసర ప్రాంతాల్లో ఉన్న తెలుగు కుటుంబాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న సామూహిక శ్రీ సీతారాముల వారి కళ్యాణం ఈ ఆదివారం వైభవంగా జరిగింది. ఆద్యంతం కమనీయంగా, కన్నులపండువగా సాగిన ఈ వేడుక చూడటానికి రెండు కళ్లు సరిపోలేదు. సిమి ఇండియా కమ్యూనిటీ సెంటర్లో జరిగిన ఈ ఉత్సవం భద్రాచల రాముల వారి కళ్యాణమును తలపించింది. సామూహికంగా నిర్వహించిన ఈ కళ్యాణ వేడుక, ఏ సంస్థతోనూ, దేవాలయంతోనూ సంబంధం లేకుండా , రెండు తెలుగు రాష్ట్రాలనుండి వచ్చి ఇక్కడ నివసిస్తున్న తెలుగు కుటుంబాల వారు కలిసి చేసుకోవడం విశేషం.

ఉదయం 8 గంటలకి ఊరేగింపుతో ప్రారంభం అయిన ఈ కార్యక్రమం మధ్యాహ్నం పెళ్లి విందు భోజనంతో ముగిసింది. భద్రాచలంలో ప్రత్యేక పూజలు చేయించుకొని అమెరికాకి చేరుకొన్న ఉత్సవమూర్తులతో మేళాతాళాల సాక్షిగా ఆడపడుచులు కోలాటంతో సాగిన ఊరేగింపు అందరి మనసులని ఆకట్టుకొంది. దాదాపు 45 మంది తెలుగు ఆడపడుచులు చేసిన కోలాటం ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

అందంగా అలంకరించుకున్న రాముల వారిని, లక్ష్మణుల వారిని, హనుమంతుల వారిని, పట్టాభిషేక పాదుకలని మగవారు అందరు వేడుకతో పెళ్లిమంటపానికి ఊరేగింపుగా తీసుకొని రాగా, ఆడపడుచులు ముందుండి చేసిన కోలాటంతో ఊరేగింపు రమణీయంగా సాగింది. గోవింద నామాలు, రామనామాలతో ప్రాంగణమంతా మార్మోగిపోయింది. ఊరేగింపులో పాల్గొన్న వారందరికి తిరుమల వీధులలో జరిగిన ఊరేగింపులో పాల్గొన్న భక్తిభావనలో మునిగిపోయారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు అందరు సంప్రదాయ వస్త్రధారణలో వచ్చి కల్యాణానికి మరింత శోభను జతచేశారు. శ్రీ సీతారాముల వారి కళ్యాణం ఆద్యంతం కమనీయంగా జరిగింది. 700 మందికి పైగా భక్తులు కల్యాణాన్ని వీక్షించి పరవశించిపోయారు . 70 కి పైగా జంటలు సామూహిక కళ్యాణంలో భాగస్వామ్యులు అయ్యారు. ముహూర్త సమయానికి , 81 మంది ఆడపడుచుల హారతుల మధ్య మేన –మామల చేతుల మీదుగా సీతమ్మ వారు పెళ్లిమంటపానికి చేరుకున్నారు. సుముహుర్త సమయాన, రాముల వారికి, సీతమ్మవారికి జీలకర్ర బెల్లంపెట్టారు. రాముల వారికి, సీతమ్మవారికి భక్తులందరూ కలిసి పట్టువస్త్రాలు, బంగారు తాళిబొట్టు, మట్టెలు, ఆభరణాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించుకొని తమ భక్తిని చాటుకొన్నారు.

కళ్యాణం జరుగుతున్నంత సేపు, విజయకూనపల్లి , హైమగార్ల 40 మంది సంగీత విద్యార్థులు ఆలపించిన రాముల వారి కీర్తనలు అందరిని అలరింపచేశాయి. దానితో పాటు, ప్రసాద రాణి గారు చేసిన వ్యాఖ్యానం పలువురికి భద్రాచలంలో జరిగే సీతారాముల వారి కళ్యాణంని తలపింపజేసింది.

దాదాపు 4 గంటలు పైగా జరిగిన ఈక ళ్యాణాన్ని చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరు కలిసి ఆనందంగా జరుపుకున్నారు. కళ్యాణం సమయంలో పాల్గొన్న భక్తులందరూ కలిసి హనుమాన్ చాలీసా, నామ రామాయణం, గోవింద నామాలు పఠించటంతో భక్తిభావాలూ వెల్లివిరిచాయి. ఎంతో అద్భుతంగా జరిగిన ఈ కళ్యాణం, గ్రాండ్ బావర్చి వారి పెళ్లి విందు భోజనంతో ముగిసింది.

నిర్వాహకులు రామ్ కోడితాలా , చందు నంగినేని, మనోహర్ ఎడ్మ, కుమార్ తాలింకి మాట్లాడుతూ, చిన్నప్పుడు రాముల వారి పందిరిలో ఆడుకున్నఅనుభవాలు, సహపంక్తి భోజనాలు, ఆ పండుగ వాతావరణం మళ్ళి జ్ఞప్తికి తెచ్చేలా, మన సంస్కృతి , సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు ముందు తరాల వారికి నేర్పించేలా, గత 3 సంవత్సరాలుగా ఈ కల్యాణాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు .

ఈ కార్యక్రమంలో సహకరించిన ప్రతి ఒక్క వాలంటీరుకు, భక్తులందరికీ, దాతలకి ధన్యవాదాలు తెలుపుతూ , మహానైవేద్యంలో సహకరించిన లీల, బిందు , శిరీష, విజయ గార్ల బృందానికి , మాలలు చేసిన రూప గారికి , అద్భుతంగా పందిరిని అలంకరించిన నీలిమ గారి బృందానికి , భోజనాదులలో ఇబ్బందులు రాకుండా చూసుకున్నసుధీర్ పెండేకంటి , కిషోర్ గరికపాటి , సునీల్ పతకమూరి, సుధీర్ కోనేరు గార్ల బృందానికి , పూజ సామాగ్రితో సాయం చేసిన సారధి గోలే , దొరబాబు కొత్తూరు గారి బృందానికి కళ్యాణం ఆద్యంతం రామకీర్తనలతో అలరించిన శ్రీమతి విజయ, హైమ మరియు ప్రసాద్ రాణి గార్ల బృందానికి , కోలాటంతో అలరించిన శ్రీమతి లతా తాలింకి గార్ల బృందానికి, ఆడియో, ఫోటోలో సహాయం అందించిన నాగరాజు బూదిరాజు, అజిత్ బుర్రా, వీరబాబు గారు , మీడియా కోఆర్డినేటర్ ప్రసూనా బాసని గార్లకి , మిగతా వాలంటీర్స్ , అనిత తోటపల్లి , అను ఓరుగంటి , అనూష సాగి , బిందు గండే , బిందు పోలవరపు, కావేరీ గూడా , చంద్రముఖి నిమ్మగడ్డ, దీప్తి పతకమూరి, దీప్తి చిరుత, గాయత్రి , గిరిధర్ నక్కల, హరిణి కాల్వల , హర్ష దామాదిరాజు, కిషోర్ రమదేను , కృష్ణచిరుత , లక్ష్మిపెదిరెడ్డి , లక్ష్మిపడాల , లీలఆగిన, మూర్తి నేమాని, నాగభూషణం , నాగరాజు బుద్ధిరాజు , నీలిమ టంగుటూరి, పద్మనేల , ఫణికాంత్ , పుష్పజయరాం , రాజ్అడపా , రాజ్గండే , రాజేష్ పెద్దిరెడ్డి , రామగార్లపల్లి , సాయి మగాగడలా , సాయి వంకినేని , శైలజ మద్దాలి , సంతోష్ ఘంటారాం , సవిత దేవరెడ్డి , శిరీష కోడితాలా , శోభా కల్వకోట, శ్రావణి గొడిశాల , సిద్దు యాదల్లా , శిరీష గాజుల , శిరీష పొట్లూరి , శ్రవణ్ , శ్రీదేవి రామదేను , శ్రీకాంత్ బండ్లమూడి , శ్రీలత తాలింకి , శ్రీనివాస్ సంపంగి , శ్రీరామ్ పడాల , సుచరిత అదేమా, సుధా దావులూరి , సుజాత కార్తికేయన్, సుమిత్ర హోసబెట్టు , సునీత పెండేకంటి , సునీత వేదాంతం , సునీత బొప్పిడి , స్వప్న పోపూరి , స్వాతి ఘంటారం , స్వాతి కుప్పిలి, ఉషశ్రీ తేజోమూర్తుల , వెంకట్ ఓరుగంటి , వెంకట నాగ , మరియు ఇతర వాలంటీర్స్ అందరికి పేరుపేరున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వీరుచేసిన ఈ ప్రయత్నాన్ని అందరు ముక్తకంఠంతో అభినందించారు. ఇలాంటి కళ్యాణం ప్రతిసంవత్సరం చెయ్యడంలో నిర్వాహకులకు తమ అండదండలు తప్పకఉంటాయని వచ్చిన ప్రతి ఒక్కరు హామీనిచ్చారు. 

శాస్త్రోస్తంగా ఘనంగా పూజ నిర్వహించిన పండిట్ శ్రీ మార్తాండశర్మ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ, ఆ దంపతులిరువుర్ని నిర్వాహకులు ఘనంగా సత్కరించారు.