సిగరెట్ తాగని తెలుగు హీరో !

June 01, 2020

అల్లు అర్జున్ ఓ మంచి పని చేశారు. ఓ సేవా కార్యక్రమాల వేదికపైననో మంచి మాట చెప్పడం వేరు. కానీ సంబంధం లేని సందర్భంలో ...ప్రత్యేకించి గుర్తుపెట్టుకుని అల్లు అర్జున్ తన అభిమానులకు ఒక మంచి సూచన చేశారు. ఇటీవల అల్లు అర్జున్ అల వైకుంఠపురం సినిమా చేసిన విషయం తెలిసిందే. తన కెరీర్ లోనే అది బిగ్ హిట్ అయ్యింది. ఈ సినిమాకు వరుసగా సక్సెస్ మీట్లు పెడుతున్నారు. ఈ సందర్భంగా తన అభిమానులకు అల్లు అర్జున్ సిగరెట్ కు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. 

 

దీనికి ఒక కారణం ఉంది. ఏదైనా ఒక సినిమా సక్సెస్ అయితే... అందులో కొన్ని మ్యానరిజాలు జనాలు అలవాటు చేసుకుంటారు. గతంలో రేస్ గుర్రం సినిమాలో దేవుడా అనే మాట అలాగే జనాల్లోకి వెళ్లింది. తాజాగా సరిలేరు నీకెవ్వరు లోని ’అర్థమవుతోందా‘ అనే మాట కూడా అలాగే కనెక్టయింది.  ఈ సినిమాలోని సిత్తరాల సిరపడు అనే పాటలో అల్లు అర్జున్ సిగరెట్ తాగుతూ కోడిని సంకనేసుకుని తిరుగుతుంటాడు. ఇది గ్రామాల్లో బాగా వైరల్ అయ్యింది. ఎంత వైరల్ అయ్యింది అంటే... అతన్ని అనుకరిస్తూ అదే డ్రెస్సులో చాలామంది ఫొటోలు, వీడియోలు తీసి నెట్లో పెడుతున్నారు.

దీంతో, దీనిని తన అభిమానులు అనుకరించి చెడిపోకూడదని అల్లు అర్జున్... వారందరికి ఓ పిలుపునిచ్చాడు. ఆ పాట కోసం నేనలా చేశాను. నాకు అసలు సిగరెట్ అలవాటు లేదు. దయచేసి నా అభిమానులు దానిని అనుకరించవద్దు అని అల్లు అర్జున్ కోరారు. మంచి మాట చెబితే ప్రశంసించాల్సిందే.