అక్క ఔట్.. సుదీర్ఘ కన్నీళ్లకు తెరపడినట్లే

August 03, 2020

ఎంత ఎమోషనల్ అయితే మాత్రం.. మరీ ఇంతనా..? నెత్తిన ట్యాంకు పెట్టిన చందంగా.. సంతోషానికి.. బాధకు తరచూ లీటర్ల కొద్దీ కన్నీళ్లు కార్చేసి.. వాతావరణాన్ని గంభీరంగా మార్చసే శివజ్యోతి బిగ్ బాస్ షో నుంచి ఎలిమినేట్ అయ్యారు. ఈ వారాంతంలో ముగిసే బిగ్ బాస్ సీజన్ 3లో శివజ్యోతి ఔట్ అయినట్లు షో చివర్లో ప్రకటించారు.
ఎప్పటిలానే ఈ సండే ఎలిమినేషన్ ఉండటం..దీనిపై ఊహాగానాలు.. అంచనాలకు తగ్గట్లే శివజ్యోతి హౌస్ నుంచి బయటకు వచ్చేశారు. దీంతో.. రాహుల్ సిప్లిగంజ్.. బాబా భాస్కర్.. అలీ.. శ్రీముఖి.. వరుణ్ లు టాప్ ఫైవ్ లో నిలిచారు. వరుణ్ సేఫ్ అని చెప్పేయటంతో.. అలీ.. శివజ్యోతి ఇద్దరిలో ఒకరు హౌస్ నుంచి బయటకు వచ్చేయాల్సిన పరిస్థితి. దీనికి బిగ్ బాస్ పేరులోని అక్షరాల్ని బోర్డు మీద ఉంచి.. ప్రతి అక్షరాన్ని తీసి వెనక్కి చూపించటం ద్వారా.. ఎవరూ ఎలిమినేట్ అవుతున్నారన్న విషయం మీద కాస్త ఉత్కంట నెలకొన్నా.. సోషల్ మీడియా లీకుల కారణంగా పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేకుండా పోయింది.
ఇప్పటివరకూ సోషల్ మీడియాలో వెలువడే అంచనాలకు తగ్గట్లే బిగ్ బాస్ షోలో జరుగుతుండటంతో శివజ్యోతి ఔట్ కావటం పెద్ద ఆశ్చర్యానికి లోనుకాలేదు. దీనికి తోడు.. అయినదానికి.. కాని దానికి ఏడ్చే శివజ్యోతిని అత్యధిక ఓట్లు ఎంపిక చేయకపోవటంతో టాప్ ఫైవ్ లో ఆమె నిలువలేకపోయారు. ఎలిమినేట్ అయి హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత.. ఆమె మీద కట్ చేసిన ఏవీని చూసినప్పుడు దాదాపు 90 శాతం సీన్లలో ఏదో కారణంగా కన్నీళ్లు పెట్టుకునే శివజ్యోతి కనిపించటం చూస్తే.. ఆమె ఏడుపు ఎంత సుదీర్ఘమన్న విషయం ఇట్టే తెలుస్తుందని చెప్పక తప్పదు.