శివసేన గెలుపు - ఒక మంచి పరిణామం ఎలాగంటే

June 03, 2020

రాజకీయాల్లో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో చెప్ప‌లేని ప‌రిస్థితి. ఇప్పుడు కూడా అదే జ‌రుగుతోంది. పెద్ద రా ష్ట్రం, వాణిజ్య రాజ‌ధాని ముంబై ఉన్న మ‌హారాష్ట్ర‌లో రాజ‌కీయంగా పార్టీల‌కు ఇక్క‌ట్లు ప్రారంభ‌మ‌య్యాయి. ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల ఫ‌లితాల్లో అధికారంలో బీజేపీ-శివ‌సేన కూట‌మిలో శివ‌సేన గ‌తం క‌న్నా కూడా భారీ గా పుంజుకుంది. అదే స‌మ‌యంలో తాము రైతుల‌కు అంత చేశాం.. ఇంత చేశాం అని చెప్పుకొన్న బీజేపీకి సీట్లు, ఓట్లు త‌గ్గిపోవ‌డం గ‌మ‌నార్హం. కేంద్రం అమ‌ల్లోకి తెచ్చిన పెద్ద‌నోట్ల ర‌ద్దు, జీఎస్టీ ప్ర‌బావం మ‌హారాష్ట్ర ఎన్నిక‌ల్లో స్ప‌ష్టంగా క‌నిపించింది.
ఇక్క‌డ మొత్తం 288 సీట్ల‌లో ఇప్ప‌టి వ‌ర‌కు విడుద‌లైన ఫ‌లితాల ప్ర‌కారం బీజేపీ కేవ‌లం 103 సీట్ల‌కే ప‌రిమి తం కావ‌డం రాజ‌కీయాల్లో చ‌ర్చ‌కు దారితీసింది. అదే స‌మ‌యంలో పొత్తు పెట్టుకున్న శివ‌సేన భారీ స్థాయిలో పుంజుకుంది. దాదాపు 65 సీట్లో ముందంజ‌లో ఉంది. దీంతో ఇప్పుడు ప్ర‌భుత్వ ఏర్పాటు విష‌యంలోనూ సేన పైచేయి సాధించాల‌ని ప్ర‌య‌త్నిస్తోంది. ఈ క్ర‌మంలోనే త‌మ‌కు సీఎం సీటును ఇవ్వాల‌ని అదే స‌మ‌యంలో ఫిఫ్టీ ఫిఫ్టీ కేబినెట్ బెర్తులు కూడా కావాల‌నే ష‌రతు పెడుతుండ‌డం గ‌మ‌నార్హం.
మొత్తంగా చూస్తే.. ఈ వ్య‌వహారంలో బీజేపీ పూర్తిగా చ‌తికిల ప‌డింద‌నే చెప్పాలి. ఐదేళ్లు అధికారంలో ఉన్న పార్టీ, అనేక ప‌థ‌కాల‌ను తెర‌మీదికి తెచ్చామ‌న్న పార్టీ ఇప్పుడు బ‌ల‌మైన ప్ర‌భావం చూప‌లేక‌పోవ‌డం దారుణంగా ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. అదే స‌మ‌యంలో మునుపెన్న‌డూ లేని విధంగా శివ‌సేన పుంజుకోవ‌డం, అధికారంలోకి రావాల‌నే దివంగ‌త బాల‌ఠాక్రే క‌ల‌ల‌ను నిజం చేయాల‌ని ఉవ్విళ్లూర‌డం కూడా స‌హ‌జ‌మే. ఈ క్ర‌మంలోనే త‌మ‌కు సీఎం సీటు ఇచ్చే పార్టీకి మ‌ద్ద‌తు ఇస్తామ‌ని తాజాగా ఎంపీ సంజ‌య్ రౌత్ ప్ర‌క‌టించ‌డం గ‌మ‌నార్హం.
ఈ ప‌రిణామం.. బీజేపీకి శ‌రాఘాతంగా ప‌రిణమించే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఎలా చూసుకున్నా.. అతి పెద్ద రాష్ట్రం మ‌హారాష్ట్ర‌లో బీజేపీ ఓట్లు, సీట్లు త‌గ్గిపోవ‌డం.. కేంద్రంలో అధికారంలో ఉండి కూడా మ‌రోసారి ఇక్క‌డ అధికారం ద‌క్కించుకునేందుకు త‌న‌ను విభేదిస్తున్న శివ‌సేన‌తోనే అంట‌కాగాల్సి రావ‌డం వంటివి పార్టీలో తీవ్ర చ‌ర్చ‌కు దారితీస్తున్నాయి. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. 

బీజేపీ బ్రహ్మాండమైన విజయం సాధించిన ఏడాదే  జరిగిన ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీ అయిన శివసేన విపరీతంగా బలం పుంజుకోవడం,  ఎన్సీపీ సుమారు 50 సీట్లు తెచ్చుకోవడం దేశంలో ప్రాంతీయ పార్టీల ప్రభ తగ్గిపోలేదు అని చెప్పడానికి ఒక చక్కని ఉదాహరణగా నిలుస్తోంది. బీజేపీకి మహారాష్ట్ర ఫలితాలు అంతుచిక్కకుండా ఉన్నాయి. ప్రాంతీయ పార్టీల నేతలను కేసుల పేరుతో వేధించడం వల్ల అన్ని చోట్లా సానుకూల ఫలితాలు రావు అని బీజేపీకి అర్థమైంది.  బీజేపీ వేధింపుల వల్లే ఎన్సీపీ పుంజుకుందని చెప్పొచ్చు.