మండ‌లి దెబ్బ‌కు ఆరుగురు మంత్రులు అవుట్‌

February 28, 2020

వైఎస్ జ‌గ‌న్ త‌న‌కు శాస‌న‌మండ‌లిలో జ‌రిగిన ప‌రిణామాలు తీవ్రంగా బాధించాయ‌ని శాస‌న‌స‌భ‌లో ప్ర‌క‌టించాడు. జ‌గ‌న్ బాధ ఖ‌రీదు చాలా ప్ర‌మాద‌క‌రంగా ఉంటుంది. అది ఎంతంగా అంటే త‌న ప‌రాభ‌వానికి కార‌ణ‌మైన మండ‌లి ర‌ద్దు దిశ‌గా అడుగులు ప‌డేంత‌గా ఉంటాయి. అలాగే మండ‌లిలో పాల‌నా వికేంద్రీక‌ర‌ణ బిల్లు, సీఆర్డీఏ ర‌ద్దు బిల్లులు ఆమోదింప‌జేసుకురావాల‌ని ఫ్లోర్ మేనేజ్‌మెంట్ త‌న ఆంత‌రంగికులైన విజ‌య‌సాయి, వైవీ, స‌జ్జ‌ల‌కు అప్ప‌గించాడు. దీంతోపాటు మండ‌లి త‌మ‌కు బ‌లం లేక‌పోయినా బిల్లులకు అడ్డంకులు ఏర్ప‌డ‌కుండా చూడాల‌ని మంత్రులు బొత్స‌, పిల్లి, మోపిదేవి, అనిల్‌, పేర్ని, కొడాలి వంటి మంత్రుల్ని మొహ‌రించాడు. ఇంత చేసినా మండలిలో తెలుగుదేశం పార్టీ చాలా వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించి బిల్లును సెలెక్ట్ క‌మిటీకి పంపించ‌గ‌లిగింది

నియంత మ‌న‌స్త‌త్వంతోపాటు, ఎదురులేని గెలుపు తెచ్చిన అహంకారంతో విర్ర‌వీగే జ‌గ‌న్‌కు ఇది శరాఘాతంలా త‌గిలింది. ప్ర‌తీకారేచ్ఛ‌తో ర‌గిలిపోతున్న జ‌గ‌న్ ముందుగా మండ‌లి ర‌ద్దు ప్ర‌య‌త్నాలకు సంకేతాలిచ్చాడు.

ఆ త‌రువాత తాను అప్ప‌గించిన ప‌నిలో విఫ‌ల‌మైన వారిని ఒక్కొక్క‌రినీ పిలిచి తాడేప‌ల్లి ఇంట్లో స్పెష‌ల్ క్లాసులు పీకాడని విశ్వ‌స‌నీయ స‌మాచారం. ఈ స్పెష‌ల్ క్లాసుల్లో అన్నీ ``ఏ`` స‌ర్టిఫికెట్ బూతులే.ముఖ్యంగా బొత్స‌ని కొట్ట‌డం ఒక‌టే.త‌క్కువ‌ జ‌ర‌గాల్సిన మ‌ర్యాద‌ల‌న్నీ జ‌రిపేశాడు జ‌గ‌న్‌. మండ‌లికి పంపి మంత్రుల్ని చేస్తే, చేత‌కాని ద‌ద్ద‌మ్మ‌ల్లా బిల్లు ఆమోదించుకోలేక వ‌చ్చి నా ఎదుట నిల‌బ‌డ్డారా? అని పిల్లి, మోపిదేవిల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాడు. ఏ మండ‌లి నుంచి మంత్రుల‌య్యారో అదే మండ‌లిని పీకేస్తాను..ఏం పీక్కుంటారో పీక్కోండి. మంత్రి ప‌ద‌వులు పోయి రోడ్డున‌ప‌డితే అప్పుడు తెలుస్తుంది అంటూ పెద్ద‌చిన్నా అంత‌రం చూడ‌కుండా తిట్టేశాడు. రెండున్న‌రేళ్ల త‌రువాత మంత్రివ‌ర్గం మార్పులు చేయాల‌నుకున్నాను..కానీ నాకా అవ‌కాశం లేకుండానే మీరే ఏరికోరి మంత్రి ప‌ద‌వులుకు ఎస‌రు తెచ్చుకున్నార‌ని, త్వ‌ర‌లో మీ అంద‌రినీ పీకి ప‌డేస్తాన‌ని నేరుగా వార్నింగ్ ఇచ్చాడు.

ఏం స‌మాధానం చెప్పాలో తెలియ‌క బిక్క‌మొఖం వేసిన మంత్రుల‌కు ఇక సామాన్లు స‌ర్దుకోండి..ఇప్ప‌టికే చాలా సార్లు చెప్పాను. మీ ప‌నితీరు బాగాలేదు మార్చుకోండ‌ని..విన‌కుండా న‌న్నీ దుస్థితికి తీసుకొచ్చారు. మండ‌లిలో జ‌రిగిన ప‌రిణామాలకు త‌లెత్తుకోలేక‌పోతున్నాను. మీ అంద‌రూ మంత్రులుగా ఇక ప‌నికిరారు. త్వ‌ర‌లోనే మీ స్థానాల‌లో కొత్త‌వారిని తీసుకుంటున్నాన‌ని బొత్స‌, పిల్లి, మోపిదేవిల ఎదుటే చెప్పేశాడు. దీంతో త‌మ మంత్రి ప‌ద‌వులుకు మండ‌లి ఎస‌రు పెట్టింద‌ని ల‌బోదిబోమంటున్నారు.

 

Read Also

కాశ్మీర్ మారణహోమంలో ప్రాణాలు అర్పించిన హిందూ పండిట్లకు శాక్రమెంటోలో నివాళి 
14ఏళ్ల సీఎంనైన నన్ను అడ్వయిజర్ వచ్చి వెళ్లిపొమ్మంటాడా..? చంద్ర బాబు
నారా లోకేష్ బ‌హిరంగ‌లేఖ‌