షాకింగ్ రివ్యూ - అవెంజర్స్ ఓ చెత్త సినిమా: హీరోయిన్

June 30, 2020

ఇది అవెంజర్స్ గురించి వచ్చిన మొదటి నెగెటివ్ రివ్యూ. అది కూడా ఓ సెలబ్రిటీ నుంచి. పైగా యంగ్ హీరోయిన్ నోటి మాట. ఇంతకీ అవెంజర్స్ ను వృథా అన్న ఆ హీరోయిన్ ... స్నేహా ఉల్లాల్. తెలుగులో పలు సినిమాల్లో నటించిన స్నేహా ఉల్లాల్ ఈ సిరీస్ సినిమాలన్నీ చూసిందట. అవెంజర్స్ - ఎండ్ గేమ్ తనను చాాలా డిజప్పాయింట్ చేసిందని ఆమె ట్వీట్ చేసింది. నాకస్సలు నచ్చలేదు. ఈ సినిమాపై తీవ్ర అయిష్టతను వ్యక్తంచేస్తున్నాను... పేర్కొంది. దానికి తగిన ఎక్స్ప్రెషన్ కూడా ఇచ్చింది (పై ఫొటో). 

ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న ఈసినిమాను ఒక నటి ఇంత బహిరంగంగా నెగిటివ్ రివ్యూ ఇవ్వడం చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఏదేమైనా ఈ సినిమా చూసిన చాలామంది పరిస్థితి ఇదేనట. ముఖ్యంగా పెద్దవాళ్లలే. అందరి ఉద్దేశం ఏంటంటే... హైప్ కనిపిస్తున్నంత సీన్ సినిమాలో లేదట. క్లైమాక్స్ వంటి ఈ సినిమా చాలా తేలిపోయిందని అంటున్నారు. అయితే సెలబ్రిటీల్లో మాత్రం ఆ మాట అన్నది మొదట స్నేహా ఉల్లాలే.

చిత్రం ఏంటంటే... ఆమె కు రిప్లయిలలో మద్దతు లభించింది. బైచింగ్ బూటియాపై బయోపిక్ ప్లాన్ చేస్తున్న ఆనంద్ కుమార్ ఆమెకు రిప్లయి ఇస్తే తన రివ్యూ కూడా అదే అన్నారు. అక్కినేని హీరో సుశాంత్ ఆమె రివ్యూపై అప్సెట్ అవుతూ రిప్లయి పెట్టగా... దయచేసి ఈ సినిమా పై వాదన వద్దు అంటూ ఆ సినిమాను మరోసారి అసహ్యించుకుందామె.  కొందరు నెటిజన్లు కొంటెగా రిప్లయి ఇచ్చారు. ఒకరయితే నువ్వు నటించిన సింహా (బాలకృష్ణ ) అంత బాలేదంటావు అంతేగా అంటూ కామెంట్ చేశారు.