సన్నీలియోన్ కి కొంచెం బుర్ర తక్కువే

August 13, 2020

సన్నీ లియాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తనకున్న ఇమేజ్ ను దశల వారీగా మార్చుకుంటూ వచ్చిన ఆమె.. ఎట్టకేలకు తన తీరుతో అందరి అభిమానాన్ని దోచుకోవటమే కాదు.. గౌరవ మర్యాదల్ని దక్కేలా చేసుకున్నారు. సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ.. అప్పుడప్పడు ఆమె పెట్టే పోస్టులు చూసినప్పుడు సన్నీలో ఇంతటి హోమ్లీ ఉమెన్ ఉందా? అని ఆశ్చర్యపోయేవారు తక్కువేమీ కాదు.
కరోనా భయాందోళనల నేపథ్యంలో సెలబ్రిటీలు ఎవరికి వారు తమకు తోచిన రీతిలో పోస్టులు పెట్టటం మొదైలంది. తాజాగా సన్నీ పెట్టిన పోస్టు చూస్తే ఆశ్చర్యంతో అవాక్కు అవ్వాల్సిందే. తన ముగ్గురు పిల్లలు (ఒకరిని దత్తత తీసుకుంటే.. సరగోసి ద్వారా కవలల్ని కన్నారు) భర్తతో కలిసి ఆమె ఫోటో దిగారు. ఈ ఫోటోలో ప్రత్యేకత ఏమంటే.. ఐదుగురు చక్కగా ముస్తాబై.. ముఖాలకు ఖరీదైన రంగురంగుల మాస్కులు ధరించటం.
కరోనాతో కొద్ది రోజులుగా ఇంటికే పరిమితమైన ఈ ఫ్యామిలీ కాస్త ఆటవిడుపుగా ఉండేందుకు వీలుగా తాజాగా బయటకు వచ్చారు. ఈ సందర్భంగా మాస్కులు ధరించిన ఫోటోను షేర్ చేస్తూ.. నా పిల్లలు ఇలా మాస్కులు ధరించి ఇబ్బంది పడుతుంటే నాకు చాలా బాధగా ఉంది. కానీ.. ఇది ఇప్పుడుచాలా అవసరమని పేర్కొన్నారు. కరోనా మీద సన్ని అవగాహన మరీ ఇంత తక్కువగా ఉందా? అని ఆశ్చర్యపోయే పరిస్థితి.
ఎందుకంటే.. కరోనా ఉన్నప్పటికీ ఆరోగ్యంగా ఉన్న వారికి మాస్కుల అవసరం లేదు. జలుబు.. జ్వరం.. దగ్గులతో బాధ పడుతున్న వారు మాత్రమే మాస్కులు ధరించాలి. కానీ.. ముందస్తు జాగ్రత్త పేరుతో అవసరం లేకున్నా చాలామంది మాస్కులు ధరిస్తున్నారు. ఇలా వాడే వారికి.. మాస్కుల్ని ఎలా వినియోగించాలన్న అంశం మీద అవగాహన తక్కువగా ఉండటం గమనార్హం. కరోనా చాపకింద నీరులా విస్తరిస్తూ.. అవసరం అయితే తప్పించి బయటకు రావొద్దన్న అధికారుల సూచనలు చేస్తున్న వేళ.. సరదాగా బయటకు రావటం ఏమిటి సన్నీ?