#WhereisKCR : సమాజం ప్రశ్నిస్తోంది !

August 13, 2020

కేసులు పది ఇరవై ఉన్నపుడు వారానికో ప్రెస్ మీట్ పెట్టి... మాటలతో మూడు గంటల ప్రెస్ మీట్ పెట్టి హడావుడి చేసిన కేసీఆర్ విపరీతంగా కేసులు పెరుగుతున్నా పట్టించుకోవడం లేదు అన్న ఆరోపణలు బాగా పెరుగుతున్నాయి. కొద్దిరోజులుగా జనం #KCRfailedTelangana అని #TelanganaCovidFailure అని ట్రెండ్ చేస్తూ ఉన్నారు. తాజాగా ఈరోజే #WhereisKCR అని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రెండవుతోంది.

పదివేల కోట్లు ఖర్చు చేసి అయినా తెలంగాణ గట్టి కోవిడ్ ను ఎదుర్కొంటాం అని చెప్పిన కేసీఆర్... హైదరాబాదులో కోవిడ్ రోగులు బెడ్లు దొరక్క అల్లాడుతుంటే అందుబాటులో లేకుండా పోయారు. ఎవర్ని కదిలించినా ఆస్పత్రులు ప్రైవేటుకు వెళ్తే బెడ్లు లేవంటున్నారు. గవర్నమెంటుకు వెళ్తే సదుపాయాల్లేవు అంటున్నారు. కేసీఆర్ ఈ వ్యవహారాన్ని డీల్ చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఇప్పటికే అనేక వీడియోలు బయటకు వచ్చాయి.

తెలంగాణలో ఈ పరిస్థితికి కారణం సరైన సమయంలో తెలంగాణసర్కారు టెస్టులు చేయకపోవడం వల్లే అంటున్నారు. మిలియన్ జనాభాకు ఎన్ని టెస్టులు చేస్తున్నారు అనే ప్రాతిపదికన దేశంలో తెలంగాణ అట్టడుగున ఉంది. పక్కనున్న ఆంధ్రలో పదిలక్షలు టెస్టులు దాటితే తెలంగాణ లక్ష పదివేలు చేశారు.

20 వేల కేసులకే హాహాకారాలు వినిపిస్తుంటే... భవిష్యత్తులో కరోనా కేసులు పెరిగితే ప్రభుత్వం సన్నద్ధంగా ఉందా ? హాస్పిటల్స్ లో పడకలు , డాక్టర్లు ,PPE సమకూర్చుకున్నమా ? అంటే లేదనే చెబుతున్నారు బాధితులు. గతంలో ఇవన్నీ అడిగిన మీడియానీ తిట్టి నోరుమూయించారు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు. కానీ ఇపుడు కనిపించకుండా పోయారు.