సోషల్ మీడియాకు బుక్కయిన జగన్ !

February 25, 2020

ఎక్కడయినా అనుభవ రాహిత్యం మనల్ని ఎపుడో ఒకసారి బుక్ చేయక తప్పదు. జగన్ కూడా దానికి మినహాయింపేం లేదు. ప్రజలతో తాను మంచోడు అనిపించుకోవాలి, అదే సమయంలో చంద్రబాబు చెడ్డోడు అని నమ్మించాలి అన్నదే లక్ష్యంగా జగన్ ముందుకు సాగుతున్నాడు. రుణమాఫీ విషయంలో జగన్ చంద్రబాబును ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. అది మాఫీ చేసినా ఈ ప్రభుత్వానికి వచ్చే క్రెడిట్ ఏమీ ఉండదు, చేయకపోతే చంద్రబాబునే తిట్టుకుంటారు అని భావించిన జగన్ గత ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీని మేము ఎందుకు నెరవేరుస్తాం అని వ్యాఖ్యానించారు. ఇక మా నాయకుడంత తెలివైనోడు ఎవడూ లేడని ఫీలయ్యే ఆయన ఎమ్మెల్యేలు... అబ్బ చంద్రబాబు మాటని మేము నెరవేర్చం అంటూ నాయకుడి మాటను వల్లెవేస్తున్నారు. కానీ సోషల్ మీడియాలో వైసీపీని జనం ఆడుకునే దాకా వారు చేస్తున్న తప్పు ఏంటో అర్థం కాలేదు.
ప్రభుత్వాధినేత ఏ పార్టీ వాడు అయినా కావచ్చు... ఆ హోదాలో తీసుకున్న నిర్ణయం ప్రభుత్వానికి సంబంధించినదే అవుతుంది గాని వ్యక్తికి సంబంధించినది, పార్టీకి సంబంధించినది కాదు. గత ప్రభుత్వం ప్రారంభించిన రుణమాఫీని ఈ ప్రభుత్వం పూర్తి చేయాల్సి ఉంటుంది. అది కనీస బాధ్యత. చంద్రబాబు హామీని మేమెందుకు నెరవేస్తాం అని వీళ్లు ప్రశ్నిస్తే... మరి ప్రధాని మన్మోహన్ ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని తీర్చమని ప్రస్తుత ప్రధాని నరేంద్రమోడీని అడిగే హక్కు జగన్ కి ఎలా వస్తుంది. గత సీఎం చేసింది నేనెందుకు చేస్తాను అని ఇతను ఫీలయినపుడు గత పీఎం చెప్పింది నేనెందుకు చేస్తాను ఈ ప్రధాని కూడా ఫీలవుతాడు కదా. తెలివి తక్కువగా మాట్లాడి ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఇపుడు విమర్శల పాలవుతున్నాడు. అంతేకదా... జగన్ అన్నది రైట్ అయితే, మోడీ మనసులో మాట కూడా రైటే కదా.
మరి మోడీ ప్రత్యేక హోదా ఇవ్వకపోడం తప్పా ఒప్పా అన్నది ఇపుడు వైసీపీ అభిమానులు చెప్పాలి. మన్మోహన్ హామీని మోడీ తీర్చాలి అనడానికి ముందు చంద్రబాబు హామీని జగన్ నెరవేర్చాల్సిందే.