ఉద్యోగం పోయిందని ఏడ్చేవాళ్లు సిగ్గుపడండి ఈ అమ్మాయిని చూసి

August 15, 2020

మనిషికి చదువు ఒక్కటే నేర్పితే అది ఉపయోగపడకపోతే అన్యాయం అయిపోతాడు

కానీ ఆ చదువుతో పాటు సంస్కారం, జీవితం విలువ, పని విలువ తెలిసినపుడే ఈ సమాజం ఆరోగ్యకరంగా పెరుగుతుంది

అందుకే మన పెద్దలు పనియే ప్రత్యక్ష దైవం అన్నారు 

పనికి తక్కువ ఎక్కువ అనే తేడాలు ఉండవు

పనులను బట్టి మనం వాటికి అలాంటి వర్ణణలు సృష్టించాం.

ఒక మనిషి చేయగలిగిన పని... ఇంకో మనిషి చేయడాన్ని నామోషీగా ఫీలవడంలోనే సమాజ పతనం ఉంది. ఆ నామోషీని జయించిన రోజున మన విజయాలను , మన సంతోషాలను ఎవరూ ఆపలేరు. 

అలాంటి అద్భుతమైన ఓ అమ్మాయిని మీకు ఈరోజు పరిచయం చేస్తున్నాం.

ఆమె పేరు శారద

బీటెక్ చదివారు

వర్చూసాలో సాఫ్ట్ వేర్ జాబ్ లో చేరింది

ట్రైనింగ్ అయిపోతున్న క్రమంలో లాక్ డౌన్ రావడంతో కొత్త నియమాకాలను ఫైర్ చేసింది కంపెనీ.

ఆ అమ్మాయి ఏ మాత్రం సీరియస్ గా తీసుకోలేదు ఆ పరిణామాన్ని. సరే చేసేదేముంది అనుకుంది.

కానీ ఇది మరో జాబ్ కి ప్రయత్నం చేసే సమయం కాదు

అందుకే తన తండ్రి తోపుడు బండిలో చేసే కూరగాయల వ్యాపారం ఒక చోట స్థిరంగా చేయాలని నిర్ణయించుకుంది. అందుకే పెద్ద ఇన్వెస్ట్ మెంట్లు ఏమీ అవసరం లేదు. తపన, శక్తి ఉంటే చాలు.

శ్రీనగర్ కాలనీలోని సంప్రదాయ స్వీట్స్ వద్ద రోడ్డుపక్కన చెట్టు కింద వ్యాపారం మొదలుపెట్టింది

ఆమె అనర్గళంగా ఆంగ్లంలో మాట్లాడటం చూసి ఆరాతీస్తే అపుడు తెలిసింది సాఫ్ట్ వేర్ జాబ్ పోయి ఆ పనిచేస్తోందని... మీడియా రిపోర్టరు ఆమెను ఇంటర్వ్యూ చేస్తూ ... ఈ పని చేస్తున్నందుకు మీరేమీ ఫీలవడం లేదా అని అడిగారు. 

‘నాకు ఎలాంటి నామోషీ లేదు. బ్రతకడానికి ఉద్యోగమే మార్గం కాదు, మనం చేయగలిగిన ఏ పని అయినా చేసుకుని బతకొచ్చు‘‘ అని చెప్పి అందరి మనసులను గెలిచింది. ఇలాంటి ఆటిట్యూడ్ ఉన్నా అమ్మాయిని కోల్పోయినందుకు ఆమెను ఉద్యోగం నుంచి తీసేసిన కంపెనీ నష్టపోయినట్లే. 

ఆమె ఆలోచన విధానం నేటి యవతకు అద్భుతమైన స్ఫూర్తి ! (కింది వీడియో చూడండి)