షాక్ : టీఆర్ఎస్‌లో బిగ్ వికెట్ ప‌డింది

October 18, 2019

తెలంగాణలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. వచ్చే ఎన్నికల నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ కేసీఆర్‌ను గద్దె దింపి తెలంగాణ రాష్ట్రంపై తమ జెండా ఎగరేయని భావిస్తున్న కాషాయ దళం అందుకు అనుగుణంగా చాపకింద నీరులా పావులు కదుపుతోంది. ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ఓవైపు కేసీఆర్... మరోవైపు బిజెపి భూస్థాపితం చేసుకుంటూ వస్తున్నాయి. కేసీఆర్ తనకు ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న కాంగ్రెస్‌ను సోదిలో లేకుండా చేశాన‌ని అనుకుంటున్నా అదే టైం లో ఆ ప్లేస్‌లోకి బిజెపి వచ్చి చివరకు టిఆర్ఎస్‌కే ఎర్త్‌ పెడుతుంది అన్న విషయాన్ని గ్రహించలేకపోయారు.

కేసీఆర్ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకునేలోగానే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అతి విశ్వాసంతో లోక్ సభ ఎన్నికల్లో టిఆర్ఎస్ ఓడిపోయింది. అన్నింటికీ మించి కేసీఆర్ కుమార్తె కవిత సైతం నిజామాబాద్‌లో ఘోరంగా ఓడిపోవాలి వచ్చింది. లోక్‌స‌భ ఎన్నిక‌ల త‌ర్వాత రాష్ట్రంలో టీఆర్ఎస్ రాజ‌కీయం వ‌న్‌సైడ్ అయిపోతుంద‌ని అనుకుంటే ఇప్పుడు బీజేపీ దూకుడు ముందు టీఆర్ఎస్‌కు మెచ్చెమ‌ట‌లు ప‌డుతున్నాయి. ఆ పార్టీకి చెందిన కీల‌క నేత‌లు కూడా కాషాయ‌ద‌ళంలోకి చేరిపోతున్నారు.

టీఆర్ఎస్ కీల‌కనేత‌, రామ‌గుండం మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ టీఆర్ఎస్‌కు రాజీనామా చేశారు. త్వరలోనే ఆయన బీజేపీలో చేరే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. 2014లో ఎమ్మెల్యేగా గెలిచిన ఆయ‌న తాజా ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ రెబ‌ల్ అభ్య‌ర్థి కోరుకంటి చందర్‌పై ఓడిపోయారు. ఆ త‌ర్వాత చంద‌ర్ టీఆర్ఎస్‌లో చేర‌డంతో పాటు కేసీఆర్‌, కేటీఆర్ ఆయ‌న‌కు ప్ర‌యార్టీ ఇవ్వ‌డంతో సోమార‌పుకు పార్టీలో ఎలాంటి ప్రాధాన్యం లేకుండా పోయింది.

టీఆర్ఎస్‌లో ఉంటే రాజ‌కీయ భ‌విష్య‌త్తు లేద‌ని డిసైడ్ అయిన ఆయ‌న ఆ పార్టీకి రాజీనామా చేసేశారు. ఇక ఆయ‌న ఐదేళ్లు ఎమ్మెల్యేగా ఉన్న‌ప్పుడే స్థానిక రామ‌గుండం మేయ‌ర్‌తో పొస‌గ‌లేదు. అప్పుడు కూడా కేటీఆర్ నుంచి ఆయ‌న‌కు స‌హాయ‌నిరాక‌ర‌ణే ఎదురైంది. ఈ క్ర‌మంలో ఈ ఎన్నిక‌ల్లో ఓడిపోవ‌డంతో సోమార‌పును లైట్ తీస్కొంటున్నారు. మంగ‌ళ‌వారం పార్టీకి రాజీనామా చేసిన ఆయ‌న గోదావరిఖనిలో మీడియాతో సోమారపు సత్యనారాయణ మాట్టాడుతూ పార్టీలో త‌న‌కు ప్రాధాన్యం లేద‌ని... ఇత‌రుల‌తో క‌లిసి ప‌నిచేయ‌లేన‌ని చెప్పేశారు. ఇక త్వ‌ర‌లోనే ఆయ‌న బీజేపీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నార‌ట‌.