బొత్స కు దిమ్మతిరిగే కౌంటర్ పడింది

June 01, 2020
CTYPE html>
రాజధాని మార్పులో జగన్ మైకుగా పనిచేస్తున్న మంత్రి బొత్స సత్యానారయణను తెలుగుదేశం నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ తో నోరుమూయించారు. అమరావతిని శ్మశానం అన్నారు. ఆ శ్మశానంలో 50 వేల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తున్నారు బొత్స గారు అంటూ టీడీపీ నేత సోమిరెడ్డి నిలదీశారు. పూటకో మాట, నోటికో మాటలా మారిన వైసీపీ నేతలు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేశారని సోమిరెడ్డి ఆరోపించారు. ప్రజల మధ్య గొడవలు పెట్టడానికి మాత్రమే ఇక్కడ 1250 ఎకరాలు పంచారని విమర్శించిన సోమిరెడ్డి... పేదలకు బొత్స వాడుకునే బాత్రూం అంత స్థలం ఇస్తారా ? అని ప్రశ్నించారు. పేదలకు కనీసం రెండు గదులు కుట్టుకునేంత కూడా భూమి ఇవ్వకుండా ఇంటి స్థలం ఇచ్చేసినట్టు మోసం చేస్తున్నారని ఆయన విమర్శించారు. 
రెండు జిల్లాల ప్రజలకు అమరావతిలో భూములు ఇస్తే... వాళ్లంతా ఊరు వదిలేసి ఇక్కడ వచ్చి ఉండాలా? అని ప్రశ్నించారు.
జగన్ ఎన్ని ప్రయత్నాలు చేసినా, అడ్డగోలుగా రాజధాని మారుద్దామని ప్రయత్నం చేసినా అది కుదరదు. ఒకవేళ బలవంతంగా తీసుకెళ్లినా అది తిరిగి అమరావతికే వస్తుంది. రైతులతో ప్రభుత్వం చట్టబద్ధ ఒప్పందం చేసుకుంది. దానిని రద్దు చేేసే శక్తి ప్రభుత్వానికి లేదు. ఒకవేళ అలా చేస్తే అది రాజధాని మార్పు కంటేఖరీదైన వ్యవహారం అయిపోతుంది. 71 రోజులు రైతులు రాజధాని  మార్చవద్దని ధర్నాలు చేస్తుంటే... జగన్ కి వారి మాట వినే సమయం లేదా? ఆయన వీళ్లకు ముఖ్యమంత్రి కాదా? కనీసం మంత్రుల కమిటీని అయినా రాజధాని రైతుల వద్దకు పంపారా? చేతకాకపోతే పదవి నుంచి దిగిపోవాలి గాని ఇలా రాష్ట్రాన్ని అథోగతి పాలుచేయకూడదని సోమిరెడ్డి జగన్ ను హెచ్చరించారు.