కన్నా అవుట్, వీర్రాజే ఇక రాజు,

August 15, 2020

ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh) భారతీ జనతా పార్టీ (Bharateeya janatha party) అధ్యక్ష పదవి నుంచి కన్నా లక్ష్మీనారాయణను తొలగిస్తూ బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆయన స్థానంలో ఎమ్మెల్సీ సోము వీర్రాజును (Somu Veerraju) నియమించింది. ఈ మేరకు  బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఈ ఆదేశాలు తక్షణం అమల్లోకి వస్తాయని ప్రకటించారు.

సోము వీర్రాజు తూర్పుగోదావరి జిల్లా కత్తేరు గ్రామానికి చెందిన వ్యక్తి. ఇతను కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. జగన్ ఎంటరయ్యాక ఏపీ రాజకీయాలన్నీ కులాల ఆధారంగానే జరుగుతున్నాయన్న దానికి తాజా బీజేపీ నియామకం కూడా ఒక ఉదాహరణే.

ఏపీలో ప్రాధాన్యం కలిగిన రెండు అగ్రకులాలు చెరో పార్టీకి మద్దతు పలుకుతున్న నేపథ్యంలో ఏపీలో జనాభా పరంగా మెజారిటీ ఉన్న కాపు సామాజిక వర్గంవైపు బీజేపీ మళ్లినట్లు తాజా నిర్ణయంతో స్ఫస్టంగా అర్థమైంది. 

ప్రస్తుతం కాపు సామాజిక వర్గం (kapu caste) మద్దతు ఉన్న జనసేన పార్టీకి (janasena party) బీజేపీతో పొత్తు ఉంది. బీజేపీ కొత్త అధ్యక్షుడిని వెతికి మరీ అదే సామాజిక వర్గం నుంచి ఎంచుకోవడం చూస్తే... కాపు ఓట్ల సమీకరణకే బీజేపీ ప్రాధాన్యం ఇస్తున్నట్లు అర్థమవుతోంది. 6 జిల్లాలో కాపుసామాజిక వర్గం పెద్ద సంఖ్యలో విస్తరించిన నేపథ్యంలో ఆ సమీకరణ చాలా ఉపయోగపడుతుందని భాజపా భావించినట్లుంది.

ఇక సోము వీర్రాజు ఇప్పటికే ఎమ్మెల్సీ... తాజాగా పార్టీ అధ్యక్షుడిని చేయడంతో ఆయనకు పదోన్నతి లభించినట్లయ్యింది.