Viral : ప్రభుత్వ ఉద్యోగిని చెప్పుతో కొట్టిన టిక్ టాక్ స్టార్

July 04, 2020

ప్రతిదానికీ కొన్ని పద్ధతులు ఉంటాయి. ఒక అధికారి పనిచేయడం లేదంటే అతన్ని అనేక రకాలుగా శిక్షించవచ్చు. కానీ గవర్నమెంటు ఉద్యోగిపై ఏకంగా చెప్పుతో దాడి చేసింది ఒక బీజేపీ మహిళా లీడర్. ఈమె టిక్ టాక్ లో ఫేమస్ అవడం ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన సొనాలి ఫొగట్. సోషల్ మీడియాలో బాగా ఫేమస్.  

సొనాలి ఫొగత్ శుక్రవారం హిసార్ లోని బల్సామండ్ మార్కెట్ యార్డును సందర్శించింది. రైతులిచ్చిన డిమాండ్ లిస్ట్‌తో మార్కెట్ అధికారి సుల్తాన్ సింగ్‌ వద్దకు వెళ్లింది. ఆ సమయంలో ఆయన అభ్యంతరకర మాటలు మాట్లాడారట. అక్కడ చాలామంది ఉన్నారు. పోలీసులు కూడా ఉన్నారు. ఇతర సిబ్బంది, రైతులు ఉన్నారు. అయినా ఆమె లెక్క చేయలేదు. సదరు అధికారిని పదే పదే చెప్పుతో కొట్టింది. 

మీరు ఇచ్చిన ఫిర్యాదులను నోట్ చేసుకున్నానని, వాటిని పరిష్కరిస్తామని వేడుకున్నా సొనాలి ఆపకపోవడం ఒక విచిత్రం అయితే... ఇంత జరుగుతున్నా ఆమె వెనుకే ఉన్న పోలీసు గాని, పక్కన ఉన్నవారు గాని ఆపే ప్రయత్నం చేయకపోవడం దారుణం. అందరూ చూస్తుండగానే ఒక ప్రభుత్వ ఉద్యోగిని ఇలా చెప్పుతో కొట్టి తీవ్రంగా అవమానించడం పెద్ద నేరమనే చెప్పాలి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంత జరిగాక మళ్లీ ఆమే దగ్గరలోని పోలీసు స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. ఆ అధికారి క్షమాపణలు చెప్పడంతో కేసు విత్ డ్రా చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. 

ఈ వీడియో వైరల్ కావడంతో కాంగ్రెస్ నేతలు స్పందించారు. వెంటనే ఫొగత్‌పై చర్యలు తీసుకోవాలంటూ సీఎం కట్టర్‌ను డిమాండ్ చేశారు. అతను ఏం తప్పు చేసిన శిక్షించడానికి చట్టం ఉంది. ఇది అమానవీయ చర్య. వెంటనే ఆమెపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. తప్పు చేసిన అధికారులను శిక్షించే పద్ధతి ఇది కాదని వారు వ్యాఖ్యానించారు.