తండ్రి పక్కనుండగా అంత ఎక్స్‌పోజింగా?

August 12, 2020

బాలీవుడ్ భామ సోనమ్ కపూర్ ఏదైనా ఈవెంట్‌కు హాజరైందంటే కెమెరాలన్నీ ఆమె చుట్టూనే తిరుగుతుంటాయి. సందర్భం ఏదైనా.. ఈవెంట్ ఎలాంటిదైనా ఆమె వీర లెవెల్లో ఎక్స్‌పోజింగ్ చేస్తుంటుంది. సినిమాల ద్వారా కంటే ఆమెకు ఎక్కువ పేరొచ్చింది ఫొటో షూట్లు, ప్రైవేట్ ఈవెంట్లతోనే. అందుకేనేమో సినిమాల్లో కంటే కూడా సెక్సీగా, అందంగా తయారై వస్తుంటుంది ఈవెంట్లకు. ఈ క్రమంలో ఆమె కొన్నిసార్లు హద్దులు దాటేస్తుంటుంది. మరే స్టార్ కిడ్ లేని స్థాయిలో ఎక్స్‌పోజింగ్ చేస్తుంటుంది. ఇలాంటి ఫొటో షూట్లకు జనాలు కూడా బాగానే అలవాటు పడిపోయారు. ఐతే తాజా తన కొత్త చిత్రం ‘మలంగ్’ ప్రమోషన్ల కోసం వచ్చిన సోనమ్.. కుర్రాళ్ల మతులు పోగొట్టే డ్రెస్‌తో వచ్చింది. క్లీవేజ్ అందాల్ని ఎక్స్‌పోజ్ చేస్తూ రెచ్చిపోయింది. వేరే సమయాల్లో అయితే ఇది మామూలే కదా అనుకునేవాళ్లు.

కానీ ఈ ఈవెంట్లో సోనమ్ తండ్రి అనిల్ కపూర్ కూడా హాజరయ్యాడు. ఆమె క్లీవేజ్ షో చేస్తూ అనిల్‌‌తోనే కలిసి పోజులిచ్చింది. అనిల్ కూడా చాలా మామూలుగానే ఫొటోలకు పోజులిచ్చాడు. ఐతే ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు ఇటు సోనమ్, అటు అనిల్.. ఇద్దరినీ వాయించేస్తున్నారు. మిగతా సమయాల్లో ఎలాగైనా కనిపించు.. కానీ తండ్రితో కలిసి పాల్గొనే ఈవెంట్‌కు ఎలాంటి డ్రెస్సింగ్‌తో రావాలో తెలియదా.. ఒకవేళ వచ్చినా.. అందాల్ని అలా ఆరబోస్తూ తండ్రితో కలిసి పోజులివ్వడమేంటి.. ఆమెకు బుద్ధి లేకపోయినా అనిల్ ఏం చేస్తున్నాడు అని తిట్టిపోసేస్తున్నారు. ఐతే తండ్రితో కలిసి సోనమ్ ఇలా పోజులివ్వడం ఇదేమీ కొత్తకాదు. ఆమె ఇలాంటి వాటికి ఫీలయ్యే టైపేమీ కాదు. కాబట్టి నెటిజన్ల ట్రోలింగ్ విషయంలో సోనమ్ స్పందించకుండా తన పని తాను చేసుకుపోతోంది.