రాయ్బరేలీ స్థానానికి నేడు సోనియా గాంధీ నామినేషన్

November 20, 2019

యూపీఏ ఛైర్పర్సన్ సోనియా గాంధీ ఉత్తరప్రదేశ్ రాయ్బరేలీ లోక్సభ స్థానానికి నేడు నామపత్రం దాఖలు చేయనున్నారు. ఇక్కడి నుంచి సోనియా ఐదోసారి బరిలో దిగుతున్నారు.

ఉత్తరప్రదేశ్ రాయ్బరేలీ లోక్సభ స్థానానికి యూపీఏ ఛైర్పర్సన్ సోనియా గాంధీ నేడు నామినేషన్ వేయనున్నారు. అంతకుముందు రాయ్బరేలీలో నిర్వహించే రోడ్ షోలో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. కుటుంబీకుల సమక్షంలో నామపత్రం దాఖలు చేయనున్నారు సోనియా.

ఉత్తరప్రదేశ్ లోని రాయ్బరేలీ లోక్సభ స్థానానికి కాంగ్రెస్ నేత, యూపీఏ ఛైర్పర్సన్ సోనియా గాంధీ 12వ తేదీన నామినేషన్ వేస్తారు. ఆమె ఇక్కడి నుంచి వరుసగా నాలుగుసార్లు గెలిచారు. ఐదోసారి పోటీ చేస్తున్నారు. 2004 నుంచి సోనియాగాంధీ రాయ్బరేలీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2006 ఉప ఎన్నికలు, 2009, 2014 సాధారణ ఎన్నికల్లో ఆమె గెలిచారు. ఇటీవలే బీజేపీలో చేరిన కాంగ్రెస్ మాజీ నేత దినేష్ ప్రతాప్ సింగ్, ఆమెపై పోటీపడుతున్నారు. కాంగ్రెస్కు పోటీగా రాయ్బరేలీలో తమ అభ్యర్థిని నిలపబోమని ఇప్పటికే ఎస్పీ- బీఎస్పీ కూటమి ప్రకటించింది. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మే 6న రాయ్బరేలీలో... ఐదో దశలో పోలింగ్ జరగనుంది.