రాహుల్ ముదిరిపోయాడురోయ్... మోడీకి పంచ్ పడింది

July 02, 2020

కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ నిజంగానే రాటుదేలార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. రాజ‌కీయాల్లోకి వ‌చ్చి చాలా రోజులే అయినా... గ‌తంలో కీల‌క భూమిక పోషించడానికి అంత‌గా ఆస‌క్తి చూప‌ని రాహుల్‌... 2014 ఎన్నిక‌ల త‌ర్వాత ఈ దిశ‌గా త‌హ‌త‌హ‌లాడార‌నే చెప్పాలి. ఇక ఇప్పుడు జ‌రుగుతున్న ఎన్నిక‌ల్లో రాహుల్ మ‌రింత‌గా యాక్టివేట్ అయ్యార‌నే చెప్పాలి. పీఎం పోస్టుకే గురి పెట్టేసిన రాహుల్‌... త‌న వ్యవ‌హార స‌ర‌ళిని పూర్తిగా మార్చేసుకున్నారు. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ కంటే కూడా త‌న‌దైన శైలి ట్విస్టుల‌ను ఇస్తున్న రాహుల్ గాంధీ... ఇటీవ‌ల తాను చెప్పిన సారీపైనా అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చారు.

శ‌నివారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో చాలా అంశాల‌పై చాలా క్లారిటీతోనే మాట్లాడిన రాహుల్‌.... మీడియా నుంచి దూసుకువ‌చ్చిన దాదాపుగా అన్ని ప్ర‌శ్న‌ల‌కు కూడా స‌మాదానం ఇచ్చారు. ఈ సంద‌ర్భంగానే తాను సారీ చెప్పిన వైనంపై వ‌చ్చిన ఓ ప్ర‌శ్న‌కు స్పందించిన రాహుల్ గాంధీ... రఫేల్ ఒప్పందంలో మోదీని ఉద్దేశించి తాను చేసిన ‘చౌకీదార్ చోర్ హై’ నినాదానికి ఇప్పటికీ కట్టుబడి ఉన్నట్టు తేల్చేశారు.

ఈ విషయంలో ‘చౌకీదార్ చోర్ హై’ నినాదాన్ని సుప్రీంకోర్టుకు ఆపాదించి తప్పు చేశానని, అందుకే క్షమాపణ చెప్పానని ఆయన అన్నారు. అయితే, తాను క్షమాపణ చెప్పింది సుప్రీంకోర్టుకే కానీ, మోదీకి కాదని కూడా ఆయ‌న ట్విస్ట్ ఇచ్చారు.