కేసీఆర్ ను దారుణంగా తిట్టిన ఎంపీ

July 04, 2020

కేసీఆర్ పై ఎంతో మంది ఎన్నో విమర్శలు చేశారు గాని... ఈరోజు బీజేపీ ఎంపీ చేసిన విమర్శకు అందరూ షాక్ అయ్యారు. గతంలో రేవంత్ రెడ్డి కూడా ఈ స్థాయిలో కేసీఆర్ ను విమర్శించలేదు. నిజానికి అది విమర్శ కాదు ... పచ్చి తిట్టు.  కేసీఆర్ ఓ పిచ్చి కుక్క అంటూ...ఆదిలాబాద్ ఎంపీ సోయం బాబూరావు తీవ్ర వ్యాఖ్య చేశారు. తులసివనంలో గంజాయి మొక్కలో తెలంగాణను పాడు చేస్తున్నారని అన్నారు. 

మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ సత్తా ఏంటో కేసీఆర్ కు అర్థమవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. మంచిర్యాలలో ఓ కార్యక్రమానికి హాజరైన బాబూరావు ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో మొన్నటి లోక్ సభ ఎన్నికల్లో గెలిచిన నలుగురు బీజేపీ ఎంపీల్లో బాబూరావు ఒకరు. 

ఇదిలా ఉండగా... మొన్నటి కేసీఆర్, జగన్ మీటింగ్ పై కూడా విమర్శలు చేశారు బాబూరావు. అది నీళ్ల కోసం జరిగిన మీటింగ్ కాదు, కేంద్రంలో బీజేపీని ఎలా నిరోధించాలా అని జుట్టుపీక్కుంటూ జరిపిన మీటింగ్ అంటూ వ్యాఖ్యానించారాయన. తెలంగాణ ప్రజలను కేసీఆర్ మోసం చేస్తున్నారని, ఆయన్ను నమ్మితే నిలువునా మునుగుతామని అన్నారు.