13 వేల మందికి షాకిచ్చిన జగన్ సర్కారు

June 02, 2020

హైదరాబాదులో ఉంటూ సొంతూరికి వెళ్లాలి అనుకుని వెళ్లలేక ఇరుక్కుపోయిన ఏపీ వాసులను ఇంటికి తీసుకెళ్తామంటూ ఏపీ సర్కారు బస్సులు ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. రేపటి నుంచి బస్సులు నడవాల్సి ఉంది. ఇప్పటిేక 13 వేల మంది స్పందన వెబ్ సైట్ ద్వారా ఈ బస్సుల్లో ప్రయాణానికి టిక్కెట్లు బుక్ చేసుకున్నారు. అయితే, తాజాగా ఈరోజు జగన్ సర్కారు వారికి ఝలక్ ఇచ్చింది. బస్సులు తాత్కాలికంగా రద్దుచేసింది. తరువాతి డేట్ త్వరో చెప్తామని పేర్కొంది. దీంతో 13 వేల మంది తీవ్ర నిరాశకు గురయ్యారు. 

దీని గురించి ఏపీ ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. కాొన్ని సాంకేతిక కారణాల వల్ల ఇది ఆగిపోయింది. కానీ త్వరలో తేదీ చెప్తాం. మీ అందరినీ మీ గమ్యాలకు చేరుస్తాం అని జగన్ సర్కారు ప్రకటించింది. ఇప్పటికి నమోదు చేసుకోని వారు ఎవరైనా ఉంటే నమోదు చేసుకోవచ్చని ఏపీ సర్కారు చెప్పింది. 

ఈ బస్సుల్లో ప్రయాణించాలి అనుకున్న వారు  https://www.spandana.ap.gov.in/ కి వెళ్లి బుక్ చేసుకోవచ్చు.  డైరెక్టు లింకు.. http://spandana1.ap.gov.in/Registration/onlineRegistration .  ఇందులో మీ వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. ఆధార్ తో సహా మీ వివరాలన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. రెడ్ జోన్లు, కంటైన్ జోన్ల వివరాలు కూడా సమర్పించాలి. కారణం కూడా తెలపాలి. ఆరోగ్య వివరాలు కూాడా నమోదు చేయాల్సి ఉంటుంది. మీరు ఒక సమూహం అయితే... ఆ విషయాన్ని కూడా వెల్లడించాలి.