వరల్డ్ ఫేమస్ సెలబ్రిటీ కూతురు పోర్న్ స్టార్ అయ్యింది  !!

August 05, 2020

వ్యభిచారం... పోర్న్ రెండూ ఒకటే ఇప్పటికి కొందరు అనుకుంటూ ఉండొచ్చు. కానీ పోర్న్ అనేది ఒక ప్రత్యేక రంగమని,  అది లక్షల కోట్ల ఇండస్ట్రీ అని, అందులో అవార్డులు, అధికారిక కంపెనీలు ఉంటాయని చాలామందికి తెలియదు.  గతిలేక, పని తెలియక, ఏం చేయడం చేతకాని వారు పోర్న్ స్టార్ లు అవుతారని చాలామందికి భ్రమ ఉంటుంది. అయితే... డబ్బుకు, పేరు కొదవలేని వారు కూడా పోర్న్ స్టార్ అవుతారనే చాలా చాలా తక్కువ మందికే తెలుసు. సన్నీలియోన్ వల్ల మన కంట్రీ ఎక్కువగా పోర్న్ గురించి  చర్చించింది. తాజాగా ప్రపంచంలో పేరుపొందిన దర్శకుడు కూతురు పోర్న్ స్టార్ అవ్వాలని డిసైడ్ అయ్యింది. ఇందుకు అవసరమైన లెసెస్సు కోసం కూడా ఆమె దరఖాస్తు చేసుకుందట. ఇంతకీ ఎవరామె అనుకుంటున్నారా?

ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు స్పీల్ బర్గ్ కూతురు. స్పీల్ బర్గ్ ఏడుగురు కూతుర్లలో ఈమె ఒకరు. మైకేలా స్పీల్ బర్గ్ దత్త పుత్రిక. అయితే... ఈ కెరీర్ తాను ఇష్టంగా ఎంచుకున్నట్టు ఆమె ప్రకటించడం విశేషం. అయితే, దానికి తండ్రి మద్దతు ఉందని ఆమె పేర్కొంది. ఈ విషయాన్ని తండ్రి కూడా ఖండించలేదు. ప్రపంచ సినీ చరిత్రలోనే గొప్ప దర్శకుల్లో ఒకడిగా నిలిచిన స్టీఫెన్ స్పీల్ బర్గ్ కూతురు ఈ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడం ఒక సంచలనం అయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా ఆమె నిర్ణయం చర్చకు దారితీసింది. 

23 ఏళ్ల మైకేలా దీనిపై తన అభిప్రాయాన్ని ఇలా చెప్పుకొచ్చింది... నా అభిరుచి మేరకే ఈ నిర్ణయం తీసుకున్నానని.. పోర్న్ రంగాన్ని కెరీర్‌గా ఎంచుకున్నానని.. ఈ విషయంలో తనకు ఎలాంటి రిగ్రెట్స్ లేవని మైకేలా వెల్లడించింది. ఈ విషయం వెల్లడించాక మైకేలా తన పోర్న్ వీడియోలను కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టడం గమనార్హం. ‘‘నేను మొదట్నుంచి సెక్స్ పట్ల ఆసక్తి ఉన్న అమ్మాయిని. ఈ విషయంలో కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నాను. ఆర్థికంగా ఎదగడానికి నా శరీరాన్ని ఉపయోగించడంలో తప్పేమీ లేదని.. ఈ విషయంలో నేను సౌకర్యవంతంగా ఉంటే మిగతా వాళ్ల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని అనుంటున్నా. నా తల్లితండ్రులు ఈ నిర్ణయానికి మద్దతు తెలిపారు’’ అని మైకేలా పేర్కొంది. 

దీనిపై ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ కామెంట్ చేస్తూ.... ప్రపంచం మరింత వికాసం సాధిస్తోంది అనడానికి ఇంతకంటే ఏం నిదర్శనం కావాలి. దేనికీ కొదవలేని ప్రపంచ ప్రముఖుడు తన కూతురు ఇష్ట ప్రకారం పోర్న్ ఇండస్ట్రీలోకి వెళ్లడానికి అంగీకరించాడు అంటే పోర్న్ ఇండస్్టరీకి ఇంతకు మించిన గొప్ప ఎండార్స్ మెంట్ ఇంకేమీ ఉండదు అని వ్యాఖ్యానించారు.