యాంకర్ శాడ్ లవ్ స్టోరీ

August 10, 2020

ప్రస్తుతం బిగ్‌బాస్ సీజన్-3 విన్నర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్న సభ్యుల్లో శ్రీముఖి ఒకటి. ముందు నుంచి హౌస్ లో యాక్టివ్ గా ఉంటూ, టాస్క్ అన్నిటిలో మంచి పెర్ఫార్మ్ చేస్తున్న శ్రీముఖికు బయట మంచి ఫాలోయింగే ఉంది. అందుకే ఆమె నామినేట్ అయిన ప్రతిసారి సేఫ్ అయ్యి బయటకొచ్చేస్తుంది. అయితే ఈ సారి కూడా ఆమె నామినేషన్లో ఉంది. ఇప్పుడు కూడా ఆమె సేఫ్ అయ్యి టాప్-5లోకి వెళ్ళుతుందని తెలుస్తోంది.
ఈ నామినేషన్ సంగతి పక్కనబెడితే...శ్రీముఖి తన లవ్ స్టోరీ గురించి బయటపెట్టి అందరిని షాకుకు గురిచేసింది. గురువారం ఎపిసోడ్లో ఇంటి సభ్యులు డార్క్ సీక్రెట్ ఉంటే చెప్పాలని బిగ్ బాస్ చెప్పాడు. దీంతో అందరూ తమ తమ జీవితాల్లో ఉన్న సీక్రెట్ లని షేర్ చేసుకున్నారు. ఇక శ్రీముఖి కూడా తన డార్క్ సీక్రెట్ చెప్పింది. అందరి అమ్మాయిలకు లాగానే తన జీవితంలో ఓ ప్రేమకథ ఉందని, కానీ అది ఫెయిల్యూర్ లవ్ స్టోరీని అని చెప్పింది. తనకు కూడా ఒక అతనితో రిలేషన్ షిప్ ఉందని, కానీ అతను అందరికి తెలిసిన ఫేస్ అని... అందుకే తమ లవ్ స్టోరీ గురించి ఎప్పుడు ఓపెన్ కాలేదని చెప్పింది.
ఒకానొక సమయంలో యాంకర్ గా ఉన్న నా షో పెద్ద హిట్ అయిందని, అటు అతనితో లైఫ్ కూడా మంచిగా సాగిపోయిందని...కానీ హఠాత్తుగా మా మధ్య డిస్టబెన్స్ వచ్చాయని, అది కాస్తా ఓ అగ్లీ బ్రేకప్ అయ్యేవరకు వెళ్లిందని బాధపడింది. తర్వాత ఆ బాధ భరించలేక చాలాసార్లు చచ్చిపోదామనే పరిస్థితికి వచ్చేశానని, ఆ రిలేషన్ షిప్ వల్ల చాలా ఏళ్లు ఏడ్చిన సందర్భాలు ఉన్నాయని చెప్పుకొచ్చింది.
అయితే అతను ఎవరో చెప్పడం తనకు ఇష్టం లేదని చెబుతూ,..తన డార్క్ సీక్రెట్ అలా బయటపెట్టింది. ఇక శ్రీముఖి లవ్ చేసింది ఎవరని ఇంటి సభ్యులతో పాటు, నెటిజన్లు కూడా ఆసక్తి చర్చ చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఎవరుకు తోచిన పేర్లని వారు చెబుతూ పోస్టులు చేస్తున్నారు.  శ్రీముఖిని లవ్ చేసిన ‘అతడు’ ఎవరో మరి..!