​శి​వ నామస్మరణ మాయం... అంతా సైరన్ మయం

June 04, 2020

ఆంధ్రప్రదేశ్ లో కరోనా మోత మోగుతోంది. ఉదయం విడుదల చేసిన రిపోర్టులో 80 కేసులు వచ్చాయి. మొత్తం కేసులు 893 కి చేరగా... ప్రఖ్యాత శివాలయాలున్న చోటే కేసులు విజృంభణ విపరీతంగా ఉంది. ఇక్కడ దేవస్థానానికి కేసులు లింకేం లేదు. కాకపోతే వైసీపీ నేతల నిర్లక్ష ఫలితం ఇది. శ్రీకాళ హస్తి... నిత్యం శివపూజలతో మారుమోగేది. ప్రఖ్యాత ఆధ్యాత్మిక కేంద్రమైన ఈ పట్టణంలో ఎమ్మెల్యే బియ్యపు మధసూదన్ రెడ్డి చేసిన తప్పిదం మూలంగా.. విపరీతంగా కేసులు పుట్టుకొస్తున్నాయి. చిన్నపట్టణంలో 47 కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతుంది. 

వైకాపా ఎమ్మెల్యే చేసిన తప్పిదానికి శ్రీకాళహస్తి పట్టణంలో ప్రజలు బిక్కుబిక్కుమంటూ భయంతో గడుపుతున్నారు. మొత్తం కేసులకు ర్యాలీయే కారణం. అందులో ఏడుగురు పోలీసులు, ముగ్గురు వీఆర్వోలు ,ఇద్దరు వాలంటీర్లు, ఇద్దరు గ్రామ సచివాలయ ఉద్యోగులు ఉండటం గమనార్హం. వీరంతా ర్యాలీలో పాల్గొన్నవారే. పరిస్థితి విషమించడంతో 30 పోలీసులు వాహనాలు గస్తీ నిర్వహించాయి. ఒక్కరు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రావొద్దని ఆదేశాలు జారీచేశారు. ఏం కావాలన్నా ఇంటికే డెలివరీ చేస్తాం అని ఎవరూ బయటకు రావొద్దని పోలీసులు హెచ్చరించారు.

25 సంవత్సరాలు బొజ్జల అక్కడ గెలిచారు. మధుసూదన్ రెడ్డి తొలిసారి గెలిచారు. కానీ ప్రజలకు మేలు చేయాల్సిన మధు ఇలా తన ఊరేగింపుతో, లాక్ డౌన్ నిబంధన ఉల్లంఘించి కరోనా సోకడానికి ప్రధాన కారణం అయ్యారు.