దేశ వ్యాప్తంగా మరోసారి ఏపీ పరువు తీశారుగా

June 03, 2020

వైసీపీ నాయకులు ఏపీని మూర్ఖత్వానికి రాజధానిగా మార్చారు. విరాళం, దానం అనేది నలుగురు తెలుసుకోవడానికి ఇచ్చేది కాదు. కష్టంలో ఉన్నవాడిని ఆదుకోవడానికి ఇచ్చేది. ఏపీ సర్కారుకు విరాళాలు ఇచ్చిన వారి గురించి పబ్లసిటీ చేయడానికి శ్రీకాళహస్తి ఎమ్మెల్యేకి ఒక పిచ్చి ఐడియా వచ్చింది. పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు వేయించి ట్రాక్టర్లపై భారీగా వాటిని ఏర్పాటుచేసి... పట్టణమంతా ర్యాలీ తీశారు. అసలు లాక్ డౌన్ లో అన్ని బంద్ ఉన్నపుడు ఈ  ఫ్లెక్సీలు ఏ దుకాణంలో డిజైన్ చేయించారు? ఏ ప్రింటింగ్ ప్రెస్ లో ముద్రించారు? అసలు ఈ ర్యాలీకి అనుమతి ఎవరు ఇచ్చారు. కలెక్టరు, ఎస్పీ, డీఎస్పీ అందరూ దీనికి బాధ్యులే. ఇపుడు ఈ ర్యాలీ కొంప ముంచింది. అధికారులు దగ్గరుండి జరిపించిన ఈ ర్యాలీలో పాల్గొన్న 11 మంది ప్రభుత్వ అధికారులకు కరోనా సోకింది. ప్రభుత్వ అధికారులు పట్టణమంతా తిరుగుతూ పనులు చేస్తున్నారు. మరి 11 వ తేదీ నుంచి ఎంత మందికి వారు ఈ వ్యాధిని అంటించారో తెలియడం లేదు. 

ఇపుడు ఈ వార్త దేశ వ్యాప్తంగా సంచలనం అవుతోంది. నమస్తే ఆంధ్ర కూడా ర్యాలీ తీసిన రోజే ఈ ర్యాలీ వల్ల కరోనా సోకుతుంది, ప్రమాదం అని రాసింది. అదే జరిగింది. ఇపుడు జాతీయ మీడియా ఈ ఎమ్మెల్యే చెత్త ఐడియాను ఏకిపడేస్తుంది. వైసీపీ నేతల పబ్లిసిటీ పిచ్చితో ఏపీని మూడో దశలోకి తీసుకెళ్లారు. అసలు ఎవరి వల్ల ఎవరికి కరోనా సోకుతందో తెలియని దారుణమైన పరిస్థితి ఇపుడు ఏపీలో నెలకొని ఉంది. 

ఇంకా దీనికి హాజరైన వారికి, కవర్ చేసిన మీడియా వారికి, చూడటానికి రోడ్ల మీదకు వచ్చిన ప్రజలకు ఎంత మందికి అంటిందో ఈ కరోనా. అసలు లాక్ డౌన్ లో ఎవరు చూస్తారని ఈ ర్యాలీ నిర్వహించారో అర్థం కాదు. అంటే కొంపదీసి ఆరోజు జనం బయటకు వచ్చినా ఎవరినీ ఏమీ అనొద్దని మౌకిక ఆదేశాలున్నట్టు్నాయి. అందుకే ర్యాలీని చూడటానికి జనం పెద్ద ఎత్తున వచ్చారు. అసలే మర్కజ్ వల్ల జిల్లా మొత్తం మీద అత్యధిక కేసులు ఇక్కడే నమోదయ్యాయి. ఒక్క శ్రీకాళహస్తి పట్టణంలో తాజాగా 34 కేసులున్నాయి.  ఇందులో ర్యాలీ ద్వారా 11 మందికి సోకిందని సమాచారం. అంటే కరోనాను కంట్రోల్ చేయడానికి సహకరించిన ఎమ్మెల్యే మధు అది ప్రబలడానికి సహకరించినట్లు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. దీనిపైనే ఇపుడు జాతీయ మీడియా దుమ్మెత్తి పోస్తోంది. ప్రజలకు సహకరించాల్సిన ప్రజాప్రతినిధి వారిని కరోనాకు బలిచేయడం ఎంత వరకు భావ్యం?