శ్రీరెడ్డి కొత్త హింట్ ఎవరి కోసం?

February 25, 2020

వివాదాలతో తరచూ వార్తల్లో ఉండే శ్రీరెడ్డి ఆ మధ్యన చెన్నైకి వెళ్లిపోవటం తెలిసిందే. హైదరాబాద్ లో ఉన్నప్పుడు ఎలా అయితే సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిందో.. చెన్నైలోనూ అలాంటి ఇమేజ్ నే సొంతం చేసుకుంది. నవరాత్రి కోసం తొమ్మిది రోజుల పాటు నిష్టగా ఉండి పూజలు చేసిన ఆమె.. ఫేస్ బుక్ లైవ్ లో కాసేపు చాట్ చేసింది. ఈ సందర్భంగా ఆమె ఒక ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు.
ఆమె చేతికి ఉన్న ఒక ఉంగరం మీద అందరి చూపులు పడేలా వీడియో సాగింది. పెళ్లి సందర్భంగా ప్రధానం సందర్భంలో ఇచ్చే ఉంగరం శ్రీరెడ్డి వేలికి ఉంది. దాన్ని చూశారేమోకానీ.. లైవ్ లో ఉన్న వారు పెళ్లి అయ్యిందన్న మాటకు.. నో.. నో.. నేను సింగిల్ అని చెప్పి.. తాను ఎవరితోనూ మింగిల్ కాలేదని చెప్పింది.
సింగిల్ గా ఉంటేనే సంతోషమని చెప్పిన ఆమె.. కాసేపటికి తన వేలికి ఉన్న కొత్త ఉంగరాన్ని చూపించింది. తన నెయిల్ పాలీష్ ఎలా ఉందని అడిగి.. ఆ తర్వాత తన వేలికి ఉన్న కొత్త ఉంగరం ఎలా ఉందని అడిగారు. దాన్ని ఒక సీక్రెట్ పర్సన్ ఇచ్చారని.. ఆ వివరాలు చెప్పనన్నారు. అయితే.. ఆ ఉంగరం ప్రధానం సందర్భంగా పెట్టే ఉంగరం కావటం గమనార్హం. మరి.. సింగిల్ అంటూనే.. రింగ్ వ్యవహారాన్నిచెప్పని శ్రీరెడ్డి తీరు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇంతకీ ఆ సీక్రెట్ పర్సన్ ఎవరో చెప్పేయొచ్చుగా శ్రీరెడ్డి?