శ్రీరెడ్డి షాకింగ్ పోస్టు.. వామ్మో.. మరీ అంత ఓపెన్ గానా?

August 03, 2020

తన మాటలతో.. సోషల్ మీడియాలో పెట్టే పోస్టులతో అదే పనిగా సంచలనంగా మారిన టాలీవుడ్ నటి శ్రీరెడ్డి తాజాగా మరోసారి ఓపెన్ అయ్యారు. ఇటీవల కాలంలో ఆమె పెట్టే వీడియోలు.. పోస్టులు.. హద్దులు మీరుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నా ఆమె మాత్రం అస్సలు తగ్గట్లేదు. టాలీవుడ్ లో తనను వాడుకొని వదిలేశారంటూ తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ.. ఇప్పటికే పలు సంచలన ఆరోపణలు చేసిన ఆమె.. తాజాగా చేసిన పోస్టు మాత్రం ప్రముఖ నిర్మాణ సంస్థ అధినేత సురేశ్ బాబుకు తలనొప్పిని మరింత పెంచేదిగా చెప్పక తప్పదు.
గడిచిన కొంతకాలంగా దగ్గుబాటి ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ వస్తున్న శ్రీరెడ్డి తాజాగా పెట్టిన పోస్టులో తనకు.. సురేశ్ బాబు కుమారుడు అభిరామ్ కు మొదటి రాత్రి నానక్ రాం గూడ రామానాయుడు స్టూడియోలోనే జరిగిందని పేర్కొంది. ఆ స్టూడియో ఇప్పుడు కనిపించకుండా పోతుందంటూ ఫేస్ బుక్ లో ఆమె పోస్టు పెట్టారు.
నానక్ రాంగూడలో ఉన్న రామానాయుడు స్టూడియోను ప్రముఖ భవన నిర్మాణ సంస్థ మీనాక్షి కన్ స్ట్రక్షన్ కు ఇచ్చేయనున్నట్లుగా ప్రచారం జరుగుతున్న వేళ.. ఆ స్టూడియోతో తనకున్న రిలేషన్ గురించి శ్రీరెడ్డి పెట్టి బోల్డ్ పోస్టు ఇప్పుడు సంచలనంగా మారింది.