సంచలనంగా శ్రీరెడ్డి అరుంధతి అవతారం

August 11, 2020

సమయానికి తగ్గట్లు కొందరు పెట్టే పోస్టులతో అందరి నోళ్లలో నానేలా చేసే సెలబ్రిటీలకు కొదవ లేదు. ఆ కోవకే చెందుతారు సంచలనాలతో నిత్యం చెట్టాపట్టాలేసుకు తిరగే నటి శ్రీరెడ్డి. ఎప్పుడు ఎవరిని ఎందుకు టార్గెట్ చేస్తారన్నది ఆమెకు మాత్రమే తెలిసిన విషయం. తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే ఆమె.. దీపావళి సందర్భంగా రోటీన్ కు భిన్నమైన పోస్టు పెట్టి అందరి చూపు తన మీద పడేలా చేసుకున్నారు.

తాజాగా ఆమె పోస్ట్ చేసిన వీడియో ఆసక్తికర చర్చకు తెర తీసింది.  తనను తాను అరుంధతిగా అభివర్ణించుకున్న ఆమె.. తన ఫేస్ బుక్ పోస్టులో ఇటీవల తాను చేసిన పూజకు సంబంధించిన చిన్న క్లిప్ ను పోస్ట్ చేశారు. అందులో నిండైన చీర.. భారీ నగలతో ఉన్న ఆమె.. సీరియస్ గా పూజ చేయటం.. హారతి ఇవ్వటం కనిపిస్తుంది. ఎవరినో హారతి అద్దుకోవాల్సిందిగా పిలిచినట్లు ఉంది.
ఇక.. తాను పోస్ట్ చేసిన వీడియోకు క్యాప్షన్ గా ఆసక్తికర వ్యాఖ్యను జోడించారు. అందరు పసుపతుల కోసం నేను సరైన పనే చేశా.. నా అమాయక మహిళలు అందరికి నేను గద్వాల అరుంధతిని అంటూ పోస్ట్ చేశారు. ఇప్పుడీ వీడియో వైరల్ గా మారింది. అరుంధతిగా తనను తాను చెప్పుకున్న శ్రీరెడ్డి రానున్న రోజుల్లో మరెన్ని రూపాల్లో దర్శనమిస్తారో?