రాజమౌళి సర్ ప్రైజ్ ....

May 25, 2020

శుభ్రతపై రాజమౌళి జనాలకు క్లాసు పీకాడు. ఏమిటండీ ఇది... మీరు ఆహ్లాదంగా ఉందని చూడటానికి వచ్చిన  ప్రదేశాన్ని ఆహ్లాదం లేకుండా చేసి పోతారా?? చెత్త అంతా అక్కడే పడేస్తారా? బాటిల్స్, ప్లాస్టిక్ తీసి ఓ బ్యాగులో పెట్టి డస్ట్ బిన్ లో వేయండి. దయచేసి ప్రకృతిని పాడు చేయొద్దు. మన కోసం, మీకోసం... మన అందరి కోసం.  ఇంత అందమైన ప్రదేశాలను పాడు చేయకండి. అయినా... ఇలా పాడు చేయడంలో మీకు వచ్చే ఆనందం ఏమిటి?

ఈ అమ్మాయిలను చూడండి. గండిపేట వెల్ఫేర్ అసోషియేషన్ ఆధ్వర్యంలో రాజశ్రీ గారి నేతృత్వంలో మీరు వేసిన చెత్త అంతా శుభ్రంగా క్లీన్ చేశారు. మరోసారి ఇలా చెత్తను పడేయకండి. మన దేశాన్ని, మన ఊరును, ప్రకృతిని కాపాడుకుందాం అంటూ... రాజమౌళి ఒక ప్రత్యేక వీడియో విడుదల చేశారు. మీరూ ఓ సారి చూడండి.