మహేష్ టీం అభిమానుల దగ్గర డబ్బులు తీసుకుందా?

May 25, 2020
CTYPE html>
సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక మంచి ఉద్దేశంతో మొదలుపెట్టిన కార్యక్రమం ఇప్పుడు అతడి చెడ్డ పేరు తీసుకొస్తోంది. అభిమానుల్ని సరిగా పట్టించుకోననే అపప్రదను తొలగించుకోవడం కోసం.. ఒకసారి అభిమానుల్ని కలిసి వాళ్లకు తనతో ఫొటో దిగే ఛాన్స్ ఇవ్వాలని అనుకున్నాడు. ఇందుకోసం మహేష్ బాబు టీం ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్ శివార్లలో తెలుగు సినిమాల షూటింగ్‌లు జరిగే అల్యూమినియం ఫ్యాక్టరీని దీనికి వేదికగా ఎంచుకున్నారు. వరుసగా మూడు రోజుల పాటు ఈ మీట్ ఉంటుందని అభిమానులకు సమాచారం వెళ్లింది. ఐతే రోజుకు ఎంతమంది అభిమానులు వస్తారు.. అందుకు తగ్గట్లుగా ఎలా ఏర్పాట్లు చేయాలి అన్నది మహేష్ టీం సరిగా ప్లాన్ చేయలేదు.
ఒకేసారి ఫ్యాన్స్ పెద్ద ఎత్తున రావడంతో వాళ్లను మేనేజ్ చేయడం చాలా కష్టమైంది. దీంతో తొక్కిసలాట జరిగే ప్రమాదం నెలకొంది. ఒక్కసారిగా ఫ్యాన్స్ దూసుకురావడంతో మహేష్ బౌన్సర్లు రంగంలోకి దిగి వాళ్లను కర్రలతో చితకబాదడంతో ఈ కార్యక్రమం గందరగోళంగా తయారైనట్లు తెలుస్తోంది. మరోవైపు మహేష్‌‌ను కలిసి ఫొటో దిగాలంటే 500 రూపాయలు ఇవ్వాలని షరతు పెట్టారని.. ఫ్యాన్స్ ఇలా డబ్బులిచ్చే ఫొటోలు దిగారని సోషల్ మీడియాలో ఒక ప్రచారం నడుస్తోంది. కొందరు అభిమానులే ఈ విషయాన్ని చెబుతున్న వీడియోలున్నాయి.
తమను బౌన్సర్లు ఎలా చితకబాదారో ఫ్యాన్స్ చెబుతున్న వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. ఇవన్నీ నిజమేనా.. దుష్ప్రచారాలా అన్నది తెలియాల్సి ఉంది. ఫొటోకు డబ్బులు తీసుకోవడం గురించి మాత్రం పెద్ద ఎత్తునే రగడ నడుస్తోంది. నేరుగా మహేష్‌ను కలిసే ఛాన్సిస్తే తాకిడి మరీ ఎక్కువ అవుతుందనే ఉద్దేశంతో ఇలా రూ.500 టికెట్ లాగా పెట్టారా.. లేక కావాలనే మహేష్‌ను బ్లేమ్ చేయడానికి ఇలా అబద్ధపు ప్రచారం చేస్తున్నారా అన్నది తెలియాల్సి ఉంది.