గత ఏడు రోజుల్లో జరిగిన నష్టం ఎంతో తెలుసా?

August 08, 2020

కరోనా దెబ్బకు అగ్రరాజ్యం అమెరికా దగ్గర నుంచి అనకాపల్లి వరకు వణికిపోతోన్న సంగతి తెలిసిందే. కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు ఇప్పటికే పలు దేశాలు షట్ డౌన్ ప్రకటించాయి. వర్క్ ఫ్రం హోం అవకాశాలున్న కంపెనీలు ఆ వెసులుబాటును వాడుకుంటున్నాయి. కరోనా ప్రభావంలో పలు దేశాల్లో ఆర్థిక మాంద్యం వచ్చే పరిస్థితి ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే స్టాక్ మార్కెట్ నూ కరోనా భయం వెంటాడుతోంది.

కరోనా ఎఫెక్ట్ తో స్టాక్ మార్కెట్ వరుసగా ఆరో రోజు కుప్పకూలింది. మరో బ్లాక్ థర్స్ డేను క్రియేట్ చేసిన సెన్సెక్స్ ఆరంభంలోనే 2155 పాయింట్లు నష్టపోయింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 581 పాయింట్లు కోల్పోయి 28,288కి పడిపోయింది. నిఫ్టీ 205 పాయింట్లు నష్టపోయి 8,263కు దిగజారింది. మరోవైపు డాలరు మారకంలో దేశీయ కరెన్సీ రూపాయి ఆల్‌ టైం కనిష్టాన్ని నమోదు చేసింది. డాలర్ తో రూపాయి మారకం విలువ 75.23కి చేరింది.  బ్లాక్ థర్స్ డే నాడు సెన్సెక్స్ లోని అన్ని ప్రధాన కంపెనీలు నష్టాల బాటలో పయనిస్తున్నాయి. ఈ ఒక్కరోజే ఇన్వెస్టర్లు దాదాపు 7 లక్షల కోట్లకు పైగా నష్టపోయారు. 

 

స్టాక్ మార్కెట్ పై కరోనా ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. రికార్డు స్థాయిలో పతనమవుతూ మదుపరులను కలవరపెడుతోంది. దేశీయ స్టాక్ మార్కెట్లలో కరోనా భయాల కారణంగా నష్టాల పర్వం ఆరో రోజూ కొనసాగింది. వరుసగా ఆరో రోజు మార్కెట్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. ఆదిలోనే హంసపాదులాగా ప్రారంభమైన కొద్ది సేపటికే సెన్సెక్స్ 2,155 పాయింట్లు నష్టపోయింది. ఓవరాల్ గా ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 581 పాయింట్లు కోల్పోయి 28,288కి పడిపోయింది. నిఫ్టీ 205 పాయింట్లు నష్టపోయి 8,263కు దిగజారింది.  ఆరంభ నష్టాలనుంచి  కోలుకుని మిడ్‌సెషన్‌లో కనిష్టం నుంచి సెన్సెక్స్‌ 2650 పాయింట్లు, నిఫ్టీ 600 పాయింట్లు, నిఫ్టీ బ్యాంకు 2100  పాయింట్లు ఎగబాకాయి. కానీ డెరివేటివ్‌ కౌంటర్‌ ముగింపు నేపథ్యంలో తిరిగి అమ్మకాలు భారీగా జరిగాయి. దీంతో,  సెన్సెక్స్‌ 581 పాయింట్లు, నిఫ్టీ 199 పాయింట్లు నష్టంతో ముగిసాయి. ఈ క్రమంలో సెన్సెక్స్‌ 28500, నిఫ్టీ 8500 పాయింట్లను నిలబెట్టుకోలేక పోయాయి. టెలికాం మినహా అన్ని సూచీలు నష్టాల్లోనే ముగిశాయి. ఐటీసీ (7.50%), భారతి ఎయిర్ టెల్ (4.39%), కోటక్ మహీంద్రా బ్యాంక్ (2.96%), హీరో మోటోకార్ప్ (2.39%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (2.26%) లాభపడగా....బజాజ్ ఫైనాన్స్ (-10.24%), మారుతి సుజుకి (-9.85%), యాక్సిస్ బ్యాంక్ (-9.50%), మహీంద్రా అండ్ మహీంద్రా (-9.28%), టెక్ మహీంద్రా (-8.43%)నష్టాలను చవిచూశాయి.