ఈ వార్త వింటే జనం చస్తారు మోడీ గారు

August 11, 2020

అసలే మార్కెట్లలో జనం నష్టపోయారు. కూరగాయలు ధరలు పెరిగాయి. ఆదాయం తగ్గింది. కంపెనీలు మూతపడ్డాయి. జీతాలు వస్తాయో రావో తెలియని పరిస్థితి. ఇలాంటి వేళ గతంలో ఎపుడూ విననటువంటి అతిపెద్ద బ్యాడ్ న్యూస్ చెప్పడానికి కేంద్రం రెడీ అయిపోయింది. పెట్రోలు, డీజిలు ధరలు కనీవినీ ఎరుగని రీతిలో పెరగనున్నాయి. ఇప్పటికే జనం ప్రపంచంలోనే మన వద్దనే పెట్రోలు ధరలు ఎక్కువ అని భావిస్తున్న తరుణంలో తాజా నిర్ణయం జనాల్ని హతాశుల్ని చేస్తుందనడంలో ఏం సందేహం లేదు. 

కరోనాతో అది ఇది అని కాదు... ప్రతి ఒక్క రంగం దారుణంగా దెబ్బతింది. ఇదేమో నెల చివర్లో విజృంభించడంతో చేతిలో చిల్లిగవ్వ లేవు. ధరలేమో అందవు. సందు దొరకిందని బ్లాక్ మాఫియా కుమ్మేస్తోంది. టామోటా వంద, మిర్చి రెండు వందలు పలికింది ఈరోజు. ఈ నేపథ్యంలో పెట్రోలు పెంపు జనాల్ని చావు దెబ్బ తీసే ప్రమాదం ఉంది. ఇంధన విక్రయాలపై ఎక్సైజ్ సుంకం ఇప్పటికి అనేక మార్లు పెంచిన మోడీ... దానిని మరింత పెంచడానికి ఆర్థిక బిల్లుకు సవరణలు చేస్తోందట. దీనిని సోమవారం ఆమోదించేశారు కూడా.  కరోనా నేపథ్యంలో చర్చ కూడా లేకుండా మూజువాణి ఓటుతో ఆమోదించేశారు. అందుకే ఇది పెద్దగా బయటకు రాలేదు. సవరణలతో కూడిన ఈ బిల్లు అమల్లోకి వస్తే... పెట్రోలు ధర 10 నుంచి 18 రూపాయల మధ్య ఎంతయినా పెరిగే ప్రమాదం ఉంది.  డీజిల్ ధర పది రూపాల్లోపు ఎంతయినా పెరిగే అవకాశం ఉంది. డీజిలు పెరిగితే నిత్యావసరాల ధరలు పెరుగుతాయి.  మోడీ తన నిర్ణయాలతో దేశాన్నే కాదు మన మనసులను కూడా అతలాకుతలం చేస్తున్నారు.