సీఎస్ బదిలీ వెనుక సీక్రెట్ స్టోరీ ఇదే !

February 25, 2020

ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంను ఆకస్మికంగా బదిలీ చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. గత సీఎం చంద్రబాబుతో ఎన్నికల వేళ ఢీ అంటే ఢీ అని.. తానే సీఎంలా వ్యవహరించిన ఎల్వీ సుబ్రహ్మణ్యం ప్రస్తుత సీఎం జగన్ చేతిలో అవమానకర రీతిలో ఉద్వాసనకు గురయ్యారు. ఎన్నికల కమిషన్ నియమించడంతో ఏపీకి సీఎస్ అయిన ఎల్వీ సుబ్రహ్మణ్యం ఎలక్షన్ రిజల్ట్ తరువాత జగన్ సీఎం కావడంతో ఆయనకు దగ్గరయ్యారు. కానీ.. అది మూణ్నాళ్ల ముచ్చటే అయింది. సీఎంకి దగ్గరైనట్లుగా ఎల్వీ భావించినా ఆయన మాత్రం ఈయన్ను ఆది నుంచి అనుమానిస్తునే ఉన్నారని వినిపిస్తోంది.
ఎన్నికల సమయంలో చంద్రబాబును బైపాస్ చేసి సీఎస్ హోదాలో ఎల్వీ సుబ్రహ్మణ్యం ప్రభుత్వాన్ని నడిపించడం అప్పట్లో జగన్‌కు నచ్చిందేమో కానీ ఇప్పుడు తాను సీఎంగా ఉండగా సీఎస్ తన మాట వినకపోవడం మాత్రం నచ్చలేదట. చిన్నచితకా ఘటనలు ఇలాంటివి ఒకట్రెండు జరిగినా జగన్ ఏమాత్రం బయటపడకపోవడంతో ఎల్వీ సుబ్రహ్మణ్యం .. తాను సీఎస్ హోదాలో జగన్‌కు సలహా ఇస్తున్నాననే అనుకున్నారు కానీ ఈ పద్ధతి జగన్‌కు నచ్చడం లేదని అనుకోలేదట.  గత వారం స్పందన కార్యక్రమంపై జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో జగన్ బయటపడ్డారని తెలుస్తోంది. ఆ వీడియో కాన్ఫరెన్స్‌లో భాగంగా కలెక్టర్లు, కార్యదర్శులతో మాట్లాడిన ఎల్వీ చెత్త డంపింగ్ యార్డుల కోసం భూములను ఎంపిక చేయడమే మొదటి ప్రాధాన్యతగా చేపట్టాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ఇళ్ళ స్థలాలు కేటాయించిన తర్వాత చెత్త డంపింగ్ యార్డులకు జాగా దొరకదన్నది ఎల్వీ అభిప్రాయం. వెంటనే జగన్ మైక్ అందుకుని.. ‘‘ ఇళ్ళ స్థలాలను గుర్తించడమే మొదటి ప్రాధాన్యత ’’ అని చెప్పి ఎల్వీకి షాకిచ్చారట.
అనంతరం సహాయ కార్యదర్శి స్థాయి అధికారి ఒకరిని సచివాలయంలోనే ఓ విభాగం నుంచి మరో విభాగానికి మార్చాలని ని ఒక విభాగం నుంచి మరో విభాగానికి బదిలీ  చేయాలని సీఎం జగన్ ఆదేశిస్తే ఎల్వీ దాన్ని పెద్దగా పట్టించుకోలేదట. మరోవైపు ప్రభుత్వానికి సంబంధించిన ఇంటర్నల్ సమాచారం ఓ మీడియా సంస్థకు సీఎస్ చెబుతున్నారని ఇంటిలిజెన్స్ నుంచి సీఎంకు నివేదిక అందిందిందన్న ప్రచారమూ ఒకటుంది. వీటన్నిటి నేపథ్యంలోనే ఆయన్ను తప్పించాలని జగన్ చూస్తున్నారట. ఇదేసమయంలో  ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసే ప్రిన్సిపల్ సెక్రెటరీ స్థాయి అధికారి ప్రవీణ్ ప్రకాశ్‌ ఓ జివోను జారీ చేయడం ఎల్వీకి ఇబ్బంది కలిగించింది. దానిపై వెంటనే ప్రవీణ్ ప్రకాశ్‌కు శనివారం నాడు షోకాజ్ నోటీస్ జారీ చేశారు ఎల్వీ. ఈ చర్య ముఖ్యమంత్రిలో మరింత ఆగ్రహాన్ని పెంచేసినట్లు సమాచారం. దీంతో మరో 6 నెలల్లో రిటైర్ కావాల్సిన ఎల్వీని సీఎస్‌గా తప్పించాలని సీఎం డిసైడయ్యారని.. ఆ పనిని ప్రవీణ్ ప్రకాశ్‌తో చేయించారని తెలుస్తోంది.