మోదీజీ -మరల అదే తప్పుచేస్తున్నారు -కమల హసన్ 

June 06, 2020

మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ మోదీకి ఘాటైన లేఖ రాశారు. గతంలో పెద్ద నోట్ల రద్దు సమయంలో చేసిన తప్పులనే మళ్లీ రిపీట్ చేస్తున్నారని గుర్తుచేశారు. వైరస్ సంక్రమణ గురించి 4 నెలల ముందు నుంచే సమాచారం ఉన్నా.. కేవలం 4గంటల వ్యవధిలో లాక్ డౌన్ ప్రకటించి పేదల జీవితాలను మరింత అంధకారంలోకి నెట్టారని ఆరోపించారు. చప్పట్లు కొట్టడం,దీపాలు వెలిగించడం లాంటి ప్రకటనలు భద్ర జీవితం గడుపుతున్న మధ్య తరగతి,ఉన్నత వర్గాలను దృష్టిలో పెట్టుకున్నవే తప్ప.. పేద వర్గాలను పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. కేవలం బాల్కనీ ప్రజల కోసమే పనిచేయకండి. నేటికి వలస కూలీల భాద వర్ణనా తీతం అని వాళ్ళు గమ్యం చేరలేక ఆశ్రయం పొందలేక తిండి తిప్పలు లేక అనుభవిస్తున్న వ్యధ కి దారి దొరకలేదని , పేదలకు మీవైపు చూడటం తప్ప ఇంకో మార్గం లేదని మోదీని ఉద్దేశించి పేర్కొన్నారు. ఓవైపు మీరు భద్ర జీవితం గడుపుతున్నవారిని దీపాలు వెలిగించమని చెబుతున్నారు.. కానీ మరోవైపు పేదోడు రేపు రొట్టెలు కాల్చేందుకు తనవద్ద సరిపడేంత నూనె ఉందా లేదా అని చూసుకుంటున్నాడని గుర్తుచేశారు. తాను మధ్య తరగతి లేదా ఏ ఇతర వర్గాలను విస్మరించమని చెప్పట్లేదని.. ఏ ఒక్కరూ ఆకలితో నిద్రపోవద్దనే చెబుతున్నానని అన్నారు. ఈ మాట చెప్పడానికి తాను చింతిస్తున్నా.. చెప్పక తప్పడం లేదని..

ఇవన్నీ మాట్లాడుతున్నందుకు ఈసారి తనని దేశ ద్రోహి అనుకున్నా ఫర్వాలేదన్నారు.. ప్రజలకు సాధారణ జీవితం,భద్రత అందించడానికే వారు ప్రభుత్వాలను ఎన్నుకున్నారని గుర్తుచేశారు. తమలో ఆగ్రహం ఇంకా ఉందని.. అయితే ఇప్పటికీ తాము మీవైపే(మోదీ) ఉన్నామని ముగించారు.