రజనీకి షాకిచ్చిన విద్యార్థులు

July 13, 2020

త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ తాజాగా న‌టిస్తున్న చిత్రం ద‌ర్బార్. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ఏఆర్ ముర‌గ‌దాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్ర షూటింగ్ తాజాగా ముంబ‌యిలో జ‌రుగుతోంది. అక్క‌డి ఒక కాలేజీలో ఈ చిత్ర షూటింగ్ నిర్వ‌హిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా అనూహ్య ఘ‌ట‌న చోటు చేసుకున్న‌ట్లుగా తెలిసింది.
కాలేజీలో జ‌రుగుతున్న షూటింగ్ ను చూసేందుకు విద్యార్థులు పెద్ద ఎత్తున షూటింగ్ స్పాట్ కు చేరుకున్నారు. సినిమాకు సంబంధించిన ఏ సీన్ కూడా బ‌య‌ట‌కు రాకూడ‌ద‌న్న ఉద్దేశంతో అక్క‌డ ఆంక్ష‌లు పెట్టారు. అయిన‌ప్ప‌టికీ.. కొంద‌రు విద్యార్థులు త‌మ ద‌గ్గ‌రున్న సెల్ ఫోన్ల‌తో వీడియోలు తీసే ప్ర‌య‌త్నం చేశారు.
దీంతో అభ్యంత‌రం వ్య‌క్తం చేసిన సినిమా బృందానికి.. విద్యార్థుల‌కు మ‌ధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇది అంత‌కంత‌కూ పెరిగిన‌ట్లుగా చెబుతున్నారు. త‌మ‌పై ఆంక్ష‌లు పెట్ట‌టాన్ని భ‌రించ‌లేని విద్యార్థుల బృందం సినిమా క్రూతో ఘ‌ర్ష‌ణ‌కు దిగారు. ఇందులో భాగంగా విద్యార్థులు రాళ్లు రువ్విన‌ట్లుగా తెలిసింది.
దీంతో.. తీవ్ర ఆగ్ర‌హానికి గురైన ద‌ర్శ‌కుడు ముర‌గదాస్..క‌ళాశాల యాజ‌మ‌న్యానికి విద్యార్థుల‌పై ఫిర్యాదు చేసిన‌ట్లు తెలిసింది. త‌న సినిమాకు సంబంధించిన ఎలాంటి సీన్లు.. ఫోటోలు బ‌య‌ట‌కు రాకూడ‌ద‌న్న ప‌ట్టుద‌ల‌తో ఉన్న ముర‌గ‌దాస్.. తాజా ప‌రిణామంపై సీరియ‌స్ గా ఉన్న‌ట్లు తెలుస్తోంది. వెంట‌నే.. లోకేష‌న్ మార్చేయాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లుగా చెబుతున్నారు.