జగన్ బ్లండర్ ... దిద్దుబాటు ఎలా?

February 17, 2020

జగన్ ఆర్నెల్ల పాలనలో హైలెట్ ఆ మూడ రంగులు, ఆ 33 వేల అప్పులే కాదు... ప్రజల డబ్బుతో పార్టీ కార్యకర్తలను ఎలా పోషించాలనే ప్రోగ్రాం కూడా ఉంది. రాష్ట్రాన్ని వైసీపీ కంపెనీగా మార్చినారా అన్నట్టు అనేక ఘటనలు వెలుగు చూస్తున్నాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో మత ప్రచారాలు, ఇష్టారాజ్యాలు, గుడి, బడి, శ్మశానం తేడా లేకుండా రంగులు వేయడం, కూలీలను రోడ్డున పడేయడం, బిల్డింగులను చెత్తపాలు చేయడం, జనాలకు పప్పు కూడు పెట్టడానికి ప్రభుత్వ భూములు అమ్మడం ఇదీ వైసీపీ పాలన అంటూ తెలుగుదేశం ముఖ్యనేత లోకేష్ విమర్శించారు. తాజాగా వైసీపీ గురుకుల విద్యార్థులతో చేయించిన అరాచక ఆగడాన్ని నారా లోకేష్ బయటపెట్టారు. 

 @ysjagan

గారూ! ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్రభుత్వాన్ని వైకాపా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ గా మార్చేసారా? లేకపోతే ప్ర‌భుత్వ గిరిజ‌న గురుకుల పాఠ‌శాల‌లో ఏంటీ సిగ్గుమాలిన ప‌నులు? అమ్మఒడి ఇస్తున్నామ‌ని ప్ర‌చారం చేసుకుని వైకాపా బ‌డులు చేస్తున్నారా? వైకాపా జెండా ఎత్త‌మంటూ ముక్కుప‌చ్చ‌లార‌ని పిల్ల‌ల‌తో ఆడించారు. రాయ‌ల‌సీమ ముద్దుబిడ్డ మ‌న జ‌గ‌న‌న్న అంటూ విద్యార్థుల‌తో పాడించారు. విద్యాశాఖా మంత్రి సాక్షిగా విద్యాల‌యాన్ని విష‌ప్ర‌చార నిల‌యం చేశారు. మొన్న భామిని త‌హ‌సీల్దార్ తాగి మ‌న జ‌గ‌న‌న్న అంటూ గెంతులేశాడు. నిన్న‌ వంద‌లాది గిరిజ‌న విద్యార్థుల‌తో వైకాపా పార్టీ ప్ర‌చార‌గీతాల‌కు స్టెప్పులేయించారు. ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల‌లో తెలుగుత‌ల్లి గీతాలాప‌న ర‌ద్దు చేసి వైకాపా పాట‌లు పెట్టేశారా? 

అంటూ లోకేష్ ముఖ్యమంత్రి జగన్ ను ప్రశ్నించారు. అయినా విద్యార్థులతో పార్టీ పాటలు, అది కూడా యూనిఫాంలో చేయించి వైకాపా నేతలు అడ్డంగా దొరికిపోయారు. జనం చూస్తారన్న భయం కూడా లేని ఈ నేతలు రేపు ఇంకా ఎలాంటి దారుణాలకు తెగిస్తారో మరి? 

పాట లింకు : https://twitter.com/i/status/1202152830590566400