లండన్ లో చిక్కుకున్న విద్యార్థులను వెంటనే ఇండియా కి రప్పించాలి

July 01, 2020
రాష్ట్ర  ప్రభుత్వం  చొరవ  చూపాలి . 
విద్యార్థులకు  అండగా  ఉన్న  తెలంగాణ  ఎన్నారై  ఫోరమ్. 
 
ఎమిరేట్స్, ఇత్హెద్  ఎయిర్  లైన్స్  ల  నిర్లక్ష్యం ,  భారత్  విమాన  రాకపోకల  రద్దు  కారణం  గా  తెలంగాణ, ఆంధ్రప్రదేశ్   రాష్ట్రాలకు  సంబంధించి  45 మంది  విద్యార్థులు  లండన్  లో  చిక్కుకున్నారు.  వారిలో  ఎవ్వరికి  ఇప్పుడు  ఇల్లు  లేదు,  భోజనం  లేదు. చివరికి  ఇండియన్  హై  కమిషన్  లో  ఉండగా  తెలంగాణ  ఎన్నారై  ఫోరమ్  వారిని  కలిసి  భరోసా  ఇచ్చింది . కొందరికి  హోటల్  లో  ఉండేందుకు  వసతి , భోజనం  సౌకర్యం  కల్పించింది.  వారాంతరం  కారణం  అలాగే  దేశ  హోం  శాఖ  కి  సంబంధించిన  అంశం  అవడం  వల్ల  సాధ్య సాధ్యాలు  పరిశీలన  ని  సమయం పట్టడం  తో  వారికి  ఇబ్బందులు  తప్పడం లేదు.తెలంగాణ ఎన్నారై    ఫోరమ్  ఫౌండర్ చైర్మన్  గంప  వేణుగోపాల్  శిబిరాన్ని  సందర్శించి  అందులో  కొందరికి  హోటల్  లో  బస,  భోజనం  ఏర్పాట్లు  చేసి ధైర్యాన్ని  నింపారు,  ఇండియన్  ఎంబసీ  ఉన్నతాధికారులతో  పరిష్కారం  పై  చర్చించగా  సోమవారం  వరకు  ఏమి  చెప్పలేమని  తెలిపారు.   విద్యార్థులకు  ఉండేందుకు   వసతి, భోజనం  ఏర్పాటు  చేస్తం  అన్నా కూడా  ఒప్పుకోవడం లేదు  హై  కమిషన్ లోనే  ఉంటాం  అన్నారు.  కొందరిని  ఒప్పించి  హోటల్  లో  చేర్పించడం  జరిగింది. 
 
మంత్రివర్యులు  శ్రీ  హరీష్  రావు  గారి  ద్వారా  పరిష్కారానికి   సంప్రదించడం  జరిగింది  
తెలంగాణ  ఎన్నారై  ఫోరమ్   వారికి  అండ  గా   మేమున్నామని   విద్యార్థుల  తల్లిదండ్రులు ఇలాంటి  బెంగ  పెట్టుకోవద్దని  భరోసా  ఇస్తుంది.   
విద్యార్థులకు  అండగా  ఉంటుందని  వారి  కుటుంబ  సభ్యులు   దైర్యం గా  ఉండాలని  సంఘ ప్రతినిధులు  ప్రమోద్  గౌడ్ , ప్రవీణ్  రెడ్డీ,  రంగు  వెంకట్, సుధాకర్  గౌడ్, మహేష్  జమ్ముల, ఆకుల  వెంకట్,  మహేష్  చట్ల,  నర్సింహా రెడ్డీ, స్వామి  ఆశ,  అశోక్  మేడిశెట్టి, రవి  కూర సంయుక్త  ప్రకటన లో  తెలిపారు.

 

Read Also

Dr లీ ముందుచూపు: మనకిప్పుడు అవసరం
10 Common Tips for Surviving the Coronavirus Pandemic By Dr. Samba Reddy (USA)
List of the COVID-19 Test Centres in India