నేను క్రిస్టియన్ కాదు బాబోయ్ - సుబ్బారెడ్డి

July 05, 2020

సోష‌ల్ మీడియా అనేది ఎవరికి లొంగని ఆయుధం. దాంతో గెలిచినోళ్లే దానికి బలైపోయే ప్రమాదమూ ఉంది. దానిని లొంగతీయాలనుకోవడం మూర్ఖత్వం. ఎందుకంటే అది ఎవరి అదుపులో ఉండదు. ఎవరికి ఎన్నిసార్లు యినా ఛాన్సు ఉంటుంది.

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం బోర్డు ఛైర్మ‌న్ ప‌ద‌విని పార్టీకి అత్యంత విధేయులు.. సీనియ‌ర్ నేత క‌మ్ బాబాయ్ సుబ్బారెడ్డికి కేటాయిస్తూ జ‌గ‌న్ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లుగా వార్త‌లు వచ్చిన విషయం తెలిసిందే. వైఎస్ కుటుంబం ఎంత ఏసుభక్తులో అందరికీ తెలిసిందే. విజయమ్మ అయితే కనీసం ఇతరు దేవుళ్ల ప్రసాదం కూడా తీసుకోెరు. వైఎస్ కుటుంబం మొత్తం యేసు భక్తులు. అలాగే ఒంగోలు మాజీ ఎంపీ సుబ్బారెడ్డి కూడా యేసు బిడ్డే. వికీపీడియాలో స్పష్టంగా గత పదేళ్లుగా అతను క్రిస్టియన్ అనే ఉంది. 

దీంతో జాతీయ స్థాయిలో సోషల్ మీడియాలో క్రిస్టియన్ కు అత్యున్నత హిందు పదవా? బీజేపీ ఏం చేస్తోంది? దీన్ని ఆంధ్ర హిందువులు ఎందుకు సహిస్తున్నారు అంటూ పెద్ద ఎత్తున పోస్టులు సోషల్ మీడియాలో కనిపించాయి.

దీంతో సుబ్బారెడ్డి రియాక్ట్ అయ్యారు. త‌మ ఇష్ట‌దైవం శ్రీ‌నివాసుడేన‌ని ఆయ‌న చెప్పుకున్నారు. సీఎం జ‌గన్ ఏ బాధ్య‌త‌లు అప్ప‌గించినా చేస్తాన‌ని.. టీటీడీ ఛైర్మ‌న్ ప‌ద‌వి రావ‌టం త‌న అదృష్టంగా ఆయ‌న అభివ‌ర్ణించారు.

అయితే, మరి ఆయన హిందువు అయితే పదేళ్లుగా ఎందుకు వికీపీడియాలో క్రిస్టియన్ అని ఉంది. పొరపాటున ఎవరో రాశారు అనుకుందాం ఆయన ఎందుకు పదేళ్లుగా దానిని పట్టించుకోలేదు. అది పరిగణలోకి తీసుకోకపోతే ఇపుడు ఎందుకు వికీపీడియాలో హిందువు అని తాజాగా మార్చారు. ఇప్పటికే వైఎస్ రాజశేఖరరెడ్డి తిరుమల జోలికి వెళ్లడం వల్లే అకాల మరణం పొందారని అందరూ అనుకుంటున్న నేపథ్యంలో వేరే పోస్టే లేనట్టు క్రిస్టియన్ బాబాయికి ఆ పోస్టే ఇవ్వాలా ముఖ్యమంత్రి గారు. ఇంకా పెద్ద పోస్టు ఇవ్వండి... అంటున్నారు జనం.