విజయసాయి గాలి తీసిన సుజన

February 17, 2020

సుజన చౌదరి విజయసాయిరెడ్డి పూచికపుల్లలా తీసి పక్కన పెట్టినా... సాయిరెడ్డి మాత్రం సుజనను వెంటాడుతూనే ఉన్నారు. ఏదో ఒక విషయం మీద సుజనను డ్యామేజ్ చేయడమే లక్ష్యంగా ట్వీట్లు వేస్తూ వస్తున్నారు. తాజాగా ఒక చిన్న విషయానికి సుజనను డ్యామేజ్ చేయబోయి ఘాటుగా తిట్లు తిన్నారు విజయసాయిరెడ్డి. ఇంతకీ ఏం జరిగిందో చూద్దాం.

వైసీపీ సిద్ధాంతం చాలా సింపుల్. మన మీద కేసులున్నాయి. ఎప్పటికీ మనం మంచివాళ్లం కాలేం. కాబట్టి... ఎదుటి వారిని చెడ్డవారిగా నిరూపిస్తే... ఆటోమేటిగ్గా అందరూ సమానం అవుతాం అన్న కాన్సెప్టుతో ముందుకు పోతుంది ఆ పార్టీ. ఆ స్ట్రాటజీయే గత ఎన్నికల్లో బాబుకు అధికారాన్ని దూరం చేసి జగన్ ని పీఠం ఎక్కించింది. తాజాగా సుజన విషయంలో గుర్రుగా ఉన్న సాయిరెడ్డి... అతని ఇమేజ్ ను బ్యాడ్ చేయడానికి బాగా ట్రై చేస్తున్న క్రమంలో... సుజన చేసిన అక్రమాలపై చర్య తీసుకోవాలని రాష్ట్రపతి కార్యాలయానికి లేఖ రాశారు. గత సెప్టెంబరులో ఆయన రాష్ట్రపతికి ఈ లేఖ రాశారు. సాధారణంగా రాష్ట్రపతికి ఎవరు లేఖ రాసినా కూడా దానికి స్పందిస్తారు. లేఖ దేనికి సంబంధించినదో పరిశీలించి ఆ డిపార్టుమెంటుకు పంపుతారు. ఆ క్రమంలో మీ లేఖను సంబంధిత శాఖకు పంపాం అని ఒక రుజువు దరఖాస్తుదారుకు లేదా లేఖ రాసిన వారికి అక్నాలెడ్జ్ మెంట్ కింద ఇస్తారు. అలా సర్వసాధారణంగా తనకు వచ్చిన అక్నాలెడ్జ్ ను అదేదో సుజనా మీద విచారణకు ఆదేశించిన లెవెల్లో సాయిరెడ్డి ప్రచారం చేయడం మొదలుపెట్టారు. అంతా క్లోజ్ రేపో మాపో సుజనా అరెస్టే తరువాయి అన్న స్థాయిలో సాయిరెడ్డి టీం హడావుడి చేసింది. దీనిపై సుజనా చౌదరి గట్టిగా స్పందించి సాయిరెడ్డికి చీవాట్లు పెట్టారు.

’’ప్రతి శుక్రవారం కోర్టుకి వెళ్తూ తుది తీర్పు కోసం వేచిచూస్తున్న విజయసాయి తనపై ఆరోపణలు చేస్తున్నారని, జైలు ఊచలు లెక్కపెట్టిన విజయసాయి ఇకనైనా నేలబారు రాజకీయాలను కట్టిపెట్టాలి’’ అంటూ సుజన ... సాయిరెడ్డిని హెచ్చరించారు. నా వ్యాపారం.. రాజకీయ జీవితాలు తెరచిన పుస్తకాలేనని.. తనపై ఎక్కడా కేసులు లేవని సాయిరెడ్డి గుర్తుపెట్టుకోవాలని, అదే సాయిరెడ్డిపై అయితే.. లెక్కలేనన్ని కేసులున్నాయని, ఈ విషయం ప్రజలకూ తెలుసన్నారు.