గాలి తీశాడు- సాయిరెడ్డివి సన్నాసి సలహాలట

May 25, 2020

విజయసాయిరెడ్డి సిద్ధాంతం ఒకటే. మనల్ని తిట్టే తిట్లు లెక్క కాదు, మనం చేసే విమర్శలే లెక్క. అందుకే ఎవరు ఏమైనా అనుకోనీ నేనేసే ట్వీట్లు వేస్తూనే ఉంటా అన్న సాయిరెడ్డి సిద్ధాంతాన్ని రెండు రోజుల్లే పసిగట్టేశాడు సుజన చౌదరి. రాజ్యసభ చరిత్రలోనే అత్యంత చౌకబారు విమర్శలు చేసే వ్యక్తిగా సాయిరెడ్డిని వర్ణించాడు సుజనా చౌదరి. ఆయనలా దిగజారలేను నేను అని పేర్కొంటూ అమరావతిలో తాను సెంటు భూమి కూడా కొనలేదని మరోసారి స్పష్టం చేశారు. తనకు, తన కుటుంబానికి సంబంధించిన భూముల లావాదేవీల వివరాలను ఈ సందర్భంగా మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా గట్టి పంచ్ లో సాయిరెడ్డి పరువు తీశాడు సుజనా చౌదరి.

సుజన పంచ్ లు

* విజయసాయిరెడ్డికి ఓ స్థాయి ఉందనుకుని భ్రమపడ్డా. ఇంతగా ఆయన దిగజారుతారని అనుకోలేదు.
* రాజకీయాల్లో ఉంటే ఆరోపణలు సహజం. ఇంత నాసిరకం ఆరోపణలు సాయిరెడ్డి తప్ప ఎవరూ చేయరు.
* నా దమ్మూ ధైర్యం చూసి ఆరు వేల కోట్లు లోనిచ్చారు. అరవై వేల కోట్లు ఇచ్చే వారుంటే తీసుకుంటాను. నా తో సమస్య ఇచ్చే వాళ్లకే లేదు నీకెందుకు? అయినా నీలా జైలుకు వెళ్లలేదు కాబట్టి నన్ను నమ్ముతున్నారు.
* విజయసాయిరెడ్డి నాసిరకం ట్వీట్లకు ఇకపై స్పందించను. ఆ స్థాయికి దిగజారడం అనవసరం.
* తనపై లేనిపోని ఆరోపణలు చేసిన వారిపై స్పందించడం టైం వేస్ట్. కానీ, కుటుంబాన్ని ఇన్వాల్వ్ చేశాక అందరం కలిసి నిర్ణయం తీసుకుని పరువు నష్టం దావా కేసు వేస్తాం.
* విజయసాయిరెడ్డి సన్నాసి సలహాల వల్లే ‘పాపం, జగన్మోహన్ రెడ్డి కి ఇన్ని కష్టాలు‘.
* జగన్ ఏదో కష్టపడి పాదయాత్ర చేసి ముఖ్యమంత్రి అయ్యారు. విజయసాయిరెడ్డి సలహాలు ఇలాగే కంటిన్యూ అయితే జగన్ కే థ్రెట్