సెటైర్.... కుక్కలు మొరుగుతున్నాయని సుజనకి ఫోన్ చేశారట

June 03, 2020

ఏపీలో వైసీపీ ప్రముఖుడు, ట్విట్టరు నేత విజయసాయిరెడ్డి బూతుపురాణం అందరినీ ఆ కంపులోకి దిచ్చింది. అత్యంత నీచమైన భాషతో విమర్శలు చేసే నాయకుడిగా సాయిరెడ్డి అందరికీ సుపరిచతం. ప్రభుత్వంలో స్కాము జరుగుతోంది... వాస్తవాలు చెప్పి మీ పారదర్శకత నిరూపించుకోవాలని డిమాండ్ చేసిన ప్రతిపక్షం బీజేపీ అధ్యక్షుడు కన్నాను నోటికొచ్చినట్లు మాట్లాడారు విజయసాయిరెడ్డి. అమ్ముడు పోయాడు బాబుకి అంటూ వ్యాఖ్యానించారు. మధ్యలో సుజన చౌదరిని లాగారు. ఇక నిన్నటి నుంచి బీజేపీ ఏపీ శాఖ సాయిరెడ్డికి చుక్కలు చూపిస్తోంది.

ఇదిలా ఉండగా... దీనిపై బీజేపీ నేత సుజన చౌదరి స్పందించారు. చాలా సెటైరిక్ గా సాయిరెడ్డికి మండేలా ట్వీట్ వేశారు. సింపుల్ గా చెప్పాలంటే సాయిరెడ్డి భాషలోనే కెలికాడు సుజన. ఆయన ఏమన్నారంటే...

నిన్న నా మిత్రులు ఫోన్ చేసి మీపై మళ్ళీ కుక్కలు మొరుగుతున్నాయని చెప్పారు. ఆరా తీస్తే, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా గారిపై, నాపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అవాకులు చెవాకులు పేలాడని తెలిసింది. ఇలాంటి నేలబారు జీవుల మొరుగుడు పట్టించుకోను నేను.  

అంటూ సుజన వ్యాఖ్యానించారు. సాయిరెడ్డికి మాత్రమే కాదు... అందరికీ తెలుగు వచ్చు, ఆయనకంటే ఎక్కువ బూతులు వచ్చు. అధికారంలో ఉన్న మాత్రాన సోషల్ మీడియాలో అందరినీ కంట్రోల్ చేయగలం అనుకుంటూ పాలన వదిలేసి ఇదే పని పెట్టుకున్నా అలా చేయడం సాధ్యం కాదు. ఎవరిపని వారు చేసుకుంటే మంచిది అని ముందు సాయిరెడ్డి తెలుసుకోవాలి. అయినా స్కాము గురించి బీజేపీ ప్రశ్నిస్తే... సమాధానం చెప్పాల్సింది సీఎంవో, సీఎస్, హెల్త్ సెక్రెటరీ, ఆరోగ్య శాఖ మంత్రి చెప్పాలి. మరి మంత్రులు అందరూ డమ్మీలేనా... సాయిరెడ్డి చెప్పిందే పార్టీలో వేదమా?