అజయ్‌ కల్లం రెడ్డి పై సుమోటోగా కేసునమోదు?   

May 22, 2020

చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఏర్పాటు చేసిన మూడు రాజధానులు ముద్దు… అమరావతి ఒద్దు అనే బహిరంగ సభలో ముఖ్యమంత్రి సలహాదారు రిటైర్డు ప్రభుత్వ ప్రదాన కార్యదర్శి అజయ్‌ కల్లం రెడ్డి చేసిన ప్రసంగాన్ని హైకోర్టు జడ్జి ఒకరు తప్పుబట్టడం జరిగింది. సుప్రీం కోర్టు న్యాయమూర్తులు కానీ, ఇతర ముఖ్యులు కానీ బినామీల పేరిట కొనుగోలు చేస్తే ఆదారాలతో, సీలు వేసిన కవర్లో సుప్రీం కోర్టు ప్రదాన న్యాయమూర్తికి అందజేయాలే తప్ప అజయ్‌ కల్లం రెడ్డిఆ విధమైన ప్రసంగాలు చేయటం నేరమని న్యాయకోవిదులు చెబుతున్నారు. ప్రభుత్వ జీతాలు తీసుకుంటూ రాజకీయ బహిరంగ వేదికలపై మాట్లాడటమే తప్పు. అంతే కాకుండా సుప్రీం కోర్టు జడ్జిల చేతుల్లో అమరావతి భూములున్నాయి అని ఆ సభలో అజయ్‌ కల్లం రెడ్డి ప్రసంగించటంపై సుమోటోగా కేసును నమోదు కూడా చేయవచ్చు అంటున్నారు.

సుప్రీం కోర్టు చీఫ్‌జడ్జికు అజయ్‌ కల్లం రెడ్డిపై కేసు నమోదు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి అని రిటైర్డు హైకోర్టు న్యాయమూర్తులు చెబుతున్నారు. ఈ విమర్శలు, ఆరోపణల పర్వంతో అజయ్‌ కల్లం రెడ్డి అధ్యాయం ముగిసి పోవటం ఖాయమంటున్నారు అదికారులు. ఆధారాలు లేకుండా… రాజకీయ, బహిరంగ వేదికలపై సుప్రీం కోర్టు న్యాయమూర్తులను వివాదంలోకి తీసుకు రావటం కోర్టు దిక్కారం అవుతోంది. అపార అధికార అనుభవం ఉన్న అజయ్‌ కల్లం రెడ్డి ఈ విషయంలో తప్పటడుగులు వేసి తన అధికార జీవితానికి మాయని మచ్చను కొని తెచ్చుకున్నారని అంటున్నారు. ప్రభుత్వ జీతాలు తీసుకుంటూ రాజకీయ నాయకులు, మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేల వలె పత్రికా సమావేశాలు నిర్వహించి ప్రతి పక్ష నాయకుడిపై విమర్శలు, ఆరోపణలు చేసిన ఘనత అజయ్‌ కల్లం రెడ్డికే దక్కింది. తనపై అజయ్‌ కల్లం రెడ్డిచేసిన విమర్శలు, ఆరోపణలకు చంద్రబాబు స్పందించలేదు.

కానీ సుప్రీం కోర్టు న్యాయమూర్తులపై ఆదారాలు లేని విమర్శలు, ఆరోపణలను బహిరంగ వేదికలపై చేస్తే ఎలాంటి పరిణామాలు ఎదురు కాబోతున్నాయి. సుప్రీం కోర్టు ప్రదాన న్యాయమూర్తి సుమోటోగా ఆయనపై కేసు నమోదు చేయిస్తారా..? సుప్రీం కోర్టు న్యాయమూర్తులు స్పందించి పత్రికల్లో వచ్చిన కధనాలతో పాటు వీడియోలు సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌కు సమర్పిస్తే పరిస్థితి ఏమిటి..? అనేది వేచి చూడాల్సిందే. మాకు తెలిసినంత వరకు అజయ్‌ కల్లం రెడ్డిచాలా మంచివారు. పది మందికి సహాయం చేయాలని తపన పడే మనస్తత్వం ఆయనది. చంద్రబాబు కూడా  ఆయనను గుర్తించి కీలక పదవులతో పాటు ప్రభుత్వ ప్రదాన కార్యదర్శి పదవిని కూడా ఇచ్చారు.
అలాంటి అజయ్‌ కల్లం రెడ్డి ఈ విధంగా మాట్లాడతారని మేము అనుకోలేదు. అందుకు ఆయన మూల్యం చెల్లించుకోక తప్పదు అంటున్నారు సీనియర్‌ ఐఎఎస్‌లు, అధికారులు.

 

RELATED ARTICLES

  • No related artciles found