వీసా గొడవ - ట్రంప్ పై సుందర్ పిచాయ్ కి కోపమొచ్చింది

August 12, 2020

కరోనా పరిణామాలతో ప్రపంచానికి అసలు ట్రంప్ పరిచయం అయ్యాడు. ప్రతి దశలోను అమెరికా అధ్యక్షుడు ప్రవర్తించిన తీరును అందరూ ఆక్షేపించారు. అమెరికా అధ్యక్షుడి తీరే కరోనా వ్యాప్తి అమెరికాను పట్టి పీడించడానికి కారణమన్నది అత్యధిక అమెరికన్ల అభిప్రాయం. అయితే, ఈ విషయంలో తన వైఫల్యాన్ని కప్పి పుచ్చుకుని రాబోయే ఎన్నికల్లో మరోసారి జెండా ఎగురవేయడానికి కీలక నిర్ణయాలు తీసుకున్నారు ట్రంప్.

అనుకోకుండా సంభవించిన జార్జ్ ఫ్లాయిడ్ మృతి అనంతరం  గొడవలతో శ్వేత జాతీయులు  మెప్పు ట్రంప్ పొందారు. ఎందుకంటే అమెరికన్లు మెజారిటీ శ్వేతజాతీయులే. అయితే శ్వేతజాతీయుల్లో ట్రంప్ ను ఫ్లాయిడ్ విషయంలో వ్యతరిేకిస్తున్నారు. ఇపుడు ఆ వ్యతిరేకించిన వారి మనసు కూడా గెలవడానికి ఇమ్మిగ్రెంట్ వ్యవహారాన్ని మళ్లీ తెరపైకి తెచ్చారు.  

అమెరికాకు వచ్చే వ‌ల‌సదారుల‌‌పై ట్రంప్ ఏప్రిల్ నుంచి 3 నెలల తాత్కాలిక నిషేధం విధించారు. వైరస్ వ్యాప్తి మరింత తీవ్రతరం కావడంతో తాజాగా ఆ నిషేధాన్ని డిసెంబరు వరకు పొడిగిస్తూ ట్రంప్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ఇది అమెరికన్లో కోసమే అని, అమెరికాలో నిరుద్యోగ స‌మ‌స్య‌ను అరికట్టేందుకే హెచ్‌1-బీ, హెచ్-4 స‌హా అన్ని ర‌కాల టెంప‌ర‌రీ వ‌ర్క్ వీసాల‌పై నిషేధం కొనసాగించాలని ఆదేశాలు జారీ చేశామన్నది ట్రంప్ వాదన. 

అయితే, ట్రంప్ చర్యలపై గూగుల్ సీఈవో సుంద‌ర్ పిచాయ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇమ్మిగ్రంట్ వీసాలపై ట్రంప్ తీరు చులకన భావంతో ఉందనిపిచాయ్ తప్పుబట్టారు. అమెరికా ఆర్థిక విజయాల్లో ఇమ్మిగ్రేష‌న్ వీసాల పాత్ర ఎన్నదగినది అన్నది పిచాయ్ అభిప్రాయపడ్డారు. అమెరికాకు జరిగిన మేథో వలసల వల్లే అమెరికా సాంకేతికపరంగా గ్లోబ‌ల్ లీడ‌ర్‌గా ఎదిగిందని సుందర్ పిచాయ్ అన్నారు. 

గూగుల్ సహా పలు దిగ్గజ సంస్థలు గొప్ప స్థానాల్లో ఉండడానికి అమెరికా లిబరల్ ఇమ్మిగ్రేషన్‌ విధానం కారణమని పిచాయ్ అభిప్రాయపడ్డారు. ట్రంప్  ప్రకటన తమను నిరుత్సాహానికి గురిచేసందన్నారు. అర్హతకు దేశాలతో సంబంధ లేదని, మేము ఎపుడూ ప్రోత్సహిస్తాం అన్నారు.