సన్నీలియోన్ చేసిన పనికి... అందరూ షాక్ !

May 30, 2020

సన్నీలియోన్ గురించి ఇలాంటి వార్తలు కూడా వస్తాయా అని ఆశ్చర్యపోకండి. ఆమె కూడా అన్ని ఎమోషన్స్ ఉన్న మనిషే. ఆ మాటకు వస్తే ఈ సృష్టిలో అతి పెద్ద మాఫియా డాన్ అయినా తనకు నచ్చిన విషయం కోసం కన్నీరు పెట్టొచ్చు. డాన్ అయితే ఏడవకూడదా? పోర్న్ స్టార్ కు కన్నీరు రాకూడదా.
అది సరే... ఇంతకీ సన్నీలియోన్ ఎందుకు ఏడ్చిందంటే... ఏ సినిమా సీను కోసమో కాదు, ఇంకొకరి కష్టం చూసి ఏడ్చింది. ఇటీవల అర్బాజ్ ఖాన్ టెలివిజన్ షో ‘పించ్' లో పాల్గొంది. ఈ సందర్భంగా తనకు బాగా తెలిసిన ఒక సినీ పరిశ్రమలో పనిచేసే శ్రామికుడిని కాపాడలేకపోయాని సన్నీలియోన్ తీవ్రంగా కంటతడి పెట్టింది. ప్రభాకర్ అనే వ్యక్తి తనతో కలిసి పనిచేశారని, అతని రెండు కిడ్నీలు ఫెయిలయ్యాయి అని చెప్పింది. అతని కిడ్నీలు మార్చడానికి 20 లక్షలు అవసరం పడ్డాయని... అయితే, ఇతర ఆస్పత్రి ఖర్చులు, లాయరు ఖర్చులు, కుటుంబ ఖర్చులు అన్నీ నేను నా భర్త పెట్టుకున్నాం. కేవలం కిడ్నీ మార్పిడి డబ్బులు మాత్రం ఇతరుల నుంచి విరాళాలు అడిగాం. అయితే మా ప్రయత్నం ఫలించలేదు. అంతలోపే అతను చనిపోయాడు అంటూ ఘొల్లుమని ఏడ్చేసింది సన్నీలియోన్.
అయితే, సన్నీలియోన్ ప్రభాకర్ తో పాటు దిగిన ఫొటో కూడా పోస్టు చేసింది. కానీ చాలా మంది నెటిజన్లు నీకు రెండు కోట్లు పెట్టి ఇల్లు కొనడానికి డబ్బులు ఉంటాయి కానీ అతనికి ఇవ్వడానికి 20 లక్షలు లేవా అని విమర్శించారు. అయితే, ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఒకటుంది. ఒక సెలబ్రిటీ టైం కూడా మనీయే. ఆ ప్రభాకర్ కోసం ఆమె పెట్టిన సమయం ఇతర దేనిపై పెట్టినా కూడా ఆ డబ్బులు ఈజీగా వచ్చేవి. కానీ ఆమె తాను డబ్బులు పెట్టడమే కాకుండా.. తన పాపులారిటీ అతని కోసం వాడింది కదా అనే కోణాన్ని ఎవరూ పట్టించుకోకుండా ఆమెను ట్రోల్ చేశారు. అంతేగానీ ఆమె సున్నితమైన మనసును వారు గుర్తించలేకపోయారు. కానీ ఇంటర్నేషనల్ పోర్న్ స్టార్, బాలీవుడ్ స్టార్ అయినా తనకు సంబంధం లేని సాధారణ వ్యక్తి కోసం పడిన ఆ తాపత్రయం చాలు ఆమె మనసు ఎలాంటిదో చెప్పడానికి. 

అయితే, ఇది దాదాపు ఏడెనిమిది నెలల క్రితం సంఘటన...కాకపోతే తాజా టీవీ షోలో ఆమె కన్నీటిపర్యంతమైంది అతనిని తలచుకుని.