అత‌డిలా ఆమెను ఎవ‌రూ కిస్ చేయ‌లేర‌ట‌!

July 04, 2020

సినిమాల్లో ఎంత బోల్డ్ గా యాక్ట్ చేస్తుందో స‌న్నీలియోన్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. బిగ్ బాస్ షోలో పాల్గొన‌టానికి ముందు వ‌ర‌కూ స‌న్నీ చాఫ్ట‌ర్ ఒక‌టైతే.. ఆ త‌ర్వాత మారిన ఆమె ఇమేజ్.. పెరిగిన ప‌లుకుబ‌డితో పాత సినిమాల‌కు దూరంగా ఉండ‌టం తెలిసిందే.
సెల‌బ్రిటీగా త‌న‌కొచ్చిన పేరు ప్ర‌ఖ్యాతులు డ్యామేజ్ కాకుండా జాగ్ర‌త్త‌గా ఉండే స‌న్నీలో ప్ర‌త్యేక‌త ఏమంటే.. సినిమాలు త‌ప్పించి.. మిగిలిన ఏ విషయాల్లో ఆమె వివాదాస్ప‌దం కాకుండా జాగ్ర‌త్త‌లు తీసుకుంటారు. ఇక‌.. భ‌ర్త‌తో ఆమె అనుబంధం లెక్క‌లు వేరుగా ఉంటాయి.
డేనియేల్ వెబ‌ర్ ను ప్రేమించి పెళ్లాడిన స‌న్నీ.. త‌న వైవాహిక జీవితాన్ని పూర్తిస్థాయిలో అస్వాదిస్తున్న‌ట్లుగా ఆమె మాట‌లు.. సోష‌ల్ మీడియాలో ఆమె పోస్ట్ చేసే పోస్టులు చెప్పేస్తుంటాయి. షూటింగ్ లేదంటే చాలు.. భ‌ర్త‌తో క‌లిసి విహార యాత్ర‌లు ప్లాన్ చేసే స‌న్నీ.. ఆ సంద‌ర్భంగా దిగిన ఫోటోల్ని ఎప్ప‌టిక‌ప్పుడు సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు.
తాజాగా ఒక ఇంట‌ర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. డేనియ‌ల్ లాంటి భ‌ర్త దొర‌క‌టం త‌న అదృష్టంగా అభివ‌ర్ణిస్తారు. ఇంట్లో ఉండే చాలు త‌న‌ను బూబ్ల అని ముద్దుగా పిలుస్తార‌ని.. అత‌డే త‌న ప్ర‌పంచంగా ఆమె చెబుతారు. సినిమాల్లో లిప్ లాక్ ఏ న‌టుడితో కంఫ‌ర్ట్ గా ఉంద‌న్న ప్ర‌శ్న‌కు బ‌దులిస్తూ.. సినిమాల్లో చాలాసార్లు లిప్ లాక్ చేసినా.. త‌న భ‌ర్త‌లా మాదిరి ఎవ‌రూ కిస్ చేయ‌లేర‌ని గొప్ప‌గా చెప్పుకుంది.