‘నన్ను పెళ్లిచేసుకుంటారా’ అంటున్న హాట్ బ్యూటీ! 

December 06, 2019

పోర్న్‌స్టార్‌ గా మంచి పాప్యులారిటీ సంపాదించిన బ్యూటీ సన్నీలియోన్‌. ఆ తర్వాత మెల్లగా వెండితెర పై ఆరంగ్రేటం చేసిన ఈ భామ.. ఇక్కడా అంతకుమించిన క్రేజ్ కొట్టేసింది. సెక్స్ బాంబ్ సన్నీలియోన్ ఏం చేసినా సెక్సీగా ఉంటుంది అనే భావనను ప్రేక్షకుల మదిలో ఇమిడేలా చేసింది సన్నీ. అందుకే  సన్నీకి  దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా అభిమానులు ఉన్నారు. పోర్న్‌ సినిమాలకు దూరమైన ఈ బ్యూటీ ప్రస్తుతం వరుస సినిమాలతో  బాలీవుడ్ లోనే కాదు సౌత్ లోను తన హవాను కొనసాగిస్తోంది. ముఖ్యంగా ఐటమ్స్ సాంగ్స్ తో తన హొయలతో యువత గుండెకు గిరాటేస్తోంది. యువ హృదయాలను సన్నీ మైకంలో ఊగేలా చేసేస్తోంది. 

సౌత్ లో ముఖ్యంగా కేరళలో సినిమాలు చేస్తున్న సన్నీ ఉమెన్స్ డే రోజున చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వెడ్డింగ్ వౌస్ అనే మ్యాగజైన్ కు కలర్ ఫుల్ గా ఫోజులు ఇచ్చిన సన్నీ ‘నన్ను పెళ్లిచేసుకుంటారా’ అని ట్వీట్ చేసింది. అంతేకాదు సన్నీ  అంటే తప్పుగా అర్ధం చేసుకునే వాళ్లకు ఈ ఫోటోతో సమాధానం చెప్పింది. ఒక సాధారణ హీరోయిన్ ఎలా ఉండాలో అలా కనిపించి కనువిందు చేసింది సన్నీ. అయితే పెట్టిన ఆ ట్వీట్ కి ‘నేనంటే.. నేను చేసుకుంటా!’ అంటూ పెద్ద ఎత్తున రిప్లైలు రావడం విశేషం. సన్నీ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.   

ఇక సన్నీ సినిమాల విషయానికొస్తే ఆమె ప్రస్తుతం  రూ.150 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ‘వీర‌మాదేవి’ అనే సినిమాలో నటిస్తోంది. తెలుగు, తమిళం, హిందీతో పాటు ప‌లు భాషల్లో రూపొందనున్న ఈ చిత్రాన్ని వి.సి.వడివుడయన్ తెరకెక్కించనుండగా, స్టీవ్స్ కార్నర్ పతాకంపై పోన్స్ స్టిఫెన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక‌ త్వరలోనే సన్నీ మ‌ల‌యాళం డెబ్యూ చిత్రం కూడా చేయబోతోంది. స‌న్నీ ప్ర‌ధాన పాత్ర‌లో బ్యాక్ వాట‌ర్ స్టూడియోస్ పతాకంపై  ద‌ర్శ‌కుడు సంతోష్ నాయ‌ర్ ఓ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్నాడు.