సుప్రీంకోర్టు చెప్పిన గుడ్ న్యూస్

August 02, 2020

ఏడాది క్రితం... సుప్రీంకోర్టు ఎట్టి పరిస్థితుల్లో మార్చి 31 తర్వాత బీఎస్ 4 రిజిస్ట్రేషన్లు చేయొద్దని ఖరాకండిగా చెప్పింది.  ఏడాది ముందుగా చెప్పడంతో కంపెనీలు కూడా తక్కువగా వాహనాలు ఉత్పత్తి చేశాయి. దీంతో చాలావరకు ఆ వాహనాలు అమ్ముడుపోయాయి. అయితే... వాయిదాలు వేసే వాళ్లు వేస్తూనే ఉంటారుగా. సరిగ్గా గడువుకు 15 రోజుల ముందు దేశంలో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. అన్ని వ్యవస్థలు బంద్. దేశమే లాక్ డౌన్. 

దీంతో బీఎస్ 4 వాహనాలు ఎలాగబ్బా అని అందరూ కంగారు పడ్డారు. ఇది అన్ని చోట్ల ఉన్న పరిస్థితి కాబట్టి సుప్రీంకోర్టు చొరవ తీసుకుంది. రిజిస్ట్రేషను గడవు పెంచింది. ఏప్రిల్ 24 వరకు రిజిస్ట్రేషను చేసుకోవచ్చు అని తెలిపింది. దీంతో ఆ వాహనాలు కొన్న వారికి ఊరట కలిగింది.

రిజిస్ట్రేషన్ కోసం వేచి చూస్తున్న వాహనాలు కమర్షియల్ 12 వేలు, కార్లు 15  వేలు, బైకులు 7 లక్షలు దేశ వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్నాయి. వీటికి విముక్తి దక్కనుంది.