వీవీ ప్యాట్ల లెక్కింపు - సుప్రీం తీర్పు ఇదే

July 10, 2020

ఈవీఎంలు మేనేజ్ చేస్తున్నారని, డమ్మీ ఈవీఎంలు కూడా పెద్ద ఎత్తున మార్కెట్లోకి వచ్చాయని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో చంద్రబాబు నేపథ్యంలో పలు పార్టీలు బ్యాలెట్ ను డిమాండ్ చేశాయి. అయితే, దానికి తగినంత సమయం లేని నేపథ్యంలో 50 శాతం వీవీ ప్యాట్ల స్లిప్స్ అయినా లెక్కించాలని కోరుతూ సుప్రీంకోర్టుకు వెళ్లారు. దీనిపై ఈరోజు సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. 

50 శాతం వీవీప్యాట్ల స్లిప్పులు లెక్కించాలని ప్రతిపక్ష పార్టీల డిమాండ్ సమంజసం కాదన్న ఎన్నికల సంఘంతో ఏకీభవించిన సుప్రీం కోర్టు 50 శాతం వీవీ ప్యాట్ల స్లిప్పులు లెక్కించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. అయితే, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 5 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన వీవీప్యాట్ల స్లిప్పులను లెక్కించాలని ఆదేశించింది. అలాగే పార్లమెంటు నియోజకవర్గంలో 35 పోలింగ్ కేంద్రాల వీవీప్యాట్ల స్లిప్పులను లెక్కించాలని ఆదేశాలు ఇచ్చింది. ఇది కొంతవరకు నయమే అయినా... ఆ 5 పోలింగ్ కేంద్రాలు ముందే నిర్ణయిస్తారా? లేక తర్వాత నిర్ణయిస్తారా? లెక్కింపు సమయంలో రాండమ్ గా ఏదయినా ఎంపిక చేస్తారా అన్నదానిపై క్లారిటీ రావాల్సి ఉంది.