​నిమ్మగడ్డ కేసు - జగన్ కి సుప్రీం షాక్

August 05, 2020

9వ తరగతి పుస్తకంలో ఉండే రాజ్యాంగం వివరాలు చదివిన పిల్లలు కూడా ఏపీ ప్రభుత్వం నిమ్మగడ్డ కేసులో చేస్తున్న ప్రయత్నం సుప్రీంకోర్టు కాదు కదా ఏ కోర్టుకు పోయినా విఫలమవుతుందని చెప్పగలరు.​ ఎందుకంటే ఈ దేశంలో 130 కోట్ల మంది ప్రజలు మద్దతు ఉన్నా కూడా రాజ్యాంగాన్ని మీరి చేయడానికి కుదరదు. రాజ్యాంగం ఉల్లంఘించారు కాబట్టే నిమ్మగడ్డ కేసులో హైకోర్టు ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది. అయితే, దీనిని అంగీకరించకుండా ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది.

యథావిధిగా సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టింది. ఏపీ సర్కారు కోరినట్టు హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వడానికి నిరాకరించింది. అంతేకాదు... రివర్స్ షాక్ ఇచ్చింది. నిమ్మగడ్డ కేసులో ప్రతివాదులకే అంటే ఏపీ సర్కారుకే నోటీసులు ఇచ్చింది. రాజ్యాంగ వ్యవస్థలతో ఆటలొద్దు అంటూ తీవ్రంగా హెచ్చరించింది. ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డను తొలగించేలా తీసుకొచ్చిన ఆర్డినెన్స్ వెనుక ఉన్న ఉద్దేశాలు సంతృప్తికరంగా లేవని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.

అసలు ఇలాంటి ఆర్డినెన్సును ఎలా ఆమోదిస్తారని తిరిగి ప్రశ్నించింది. ఈ వ్యవహాంలో ఏపీ ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్సుుక సంబంధించి ప్రభుత్వమే వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు జగన్ ప్రభుత్వానికి ఊహించని విధంగా నోటీసులు ఇవ్వడం గమనార్హం.