హైకోర్టు గడువిచ్చింది, సుప్రీంకోర్టు ఏకంగా వార్నింగే ఇచ్చింది

August 05, 2020

అతి తెలివి ప్రదర్శిస్తున్న ఏపీ సర్కారుకు సుప్రీంకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. రంగుల విషయంలో గతంలో హైకోర్టు తీర్పు తప్పు అంటూ సుప్రీంకోర్టుకు వెళ్లిన వైసీపీని రంగులు మార్చాల్సిందే, దీనిపై మీరు ఏం చెప్పాలనుకున్నా హైకోర్టులోనే తేల్చుకోండి అని తిప్పి పంపిన విషయం తెలిసిందే. 

ఆ క్రమంలో అనేక వాదోపవాదాల అనంతరం హైకోర్టు ఏపీ సర్కారుకు చీవాట్లు చివరకు 3 వారాల గడువిచ్చి పంపింది. దీనిపై అతితెలివి ప్రదర్శించిన జగన్ సర్కారు కొత్త 623 జీవో తెచ్చి వైసీపీ రంగులకు టెర్రకోట రంగు కలిపి వేసింది. 

దీనిని కోర్టు ధిక్కరణ కింద భావించిన హైకోర్టు ఆ జీవోను రద్దు చేసింది. అయితే, అవి మా పార్టీ రంగులు కాదు, 4 రంగులు వేశాం అంటూ జగన్ సర్కారు సుప్రీంకోర్టులో మాటల గారడీ చేసే ప్రయత్నం చేసింది. దీనిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వెలిబుచ్చింది. ఇదంతా నాన్సెన్స్ అంటూ కొట్టిపారేసింది.

వెంటనే రంగులు తొలగించండి. ఎట్టి పరిస్థితుల్లోను పార్టీ రంగులు వేయడానికి వీల్లేదు. మీకు కేవలం నాలుగు వారాలు గడువు ఇస్తున్నాం. ఇంతకుమించి దీనిలో చెప్పడానికేం లేదు అంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

నాలుగు వారాల్లో రంగులు తొలగించని పక్షంలో కోర్టు ధిక్కరణగా పరిగణిస్తామని ఏపీ సర్కారును గట్టిగా హెచ్చరించింది సుప్రీంకోర్టు. దీంతో ఒక్క రంగుల విషయంలోనే హైకోర్టు, సుప్రీంకోర్టులో జగన్ గవర్నమెంటు రెండు సార్లు గట్టిగా చీవాట్లు పెట్టించుకుంది.