టాలీవుడ్ కి కోలీవుడ్ సెల్యూట్

June 05, 2020

అల‌నాటి టాలీవుడ్ హీరో, విల‌క్షణ న‌టుడు మోహ‌న్ బాబు కొంత‌కాలంగా వెండితెర‌కు దూరంగా ఉన్న సంగ‌తి తెలిసిందే. 500కు పైగా చిత్రాల్లో న‌టించిన ఈ క‌లెక్ష‌న్ కింగ్...`మ‌హాన‌టి` చిత్రం త‌ర్వాత కొంత గ్యాప్ తీసుకున్నారు. 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల నేప‌థ్యంలో రాజ‌కీయాల‌తో కొద్దిగా బిజీ అయిన మోహ‌న్ బాబు తాజాగా తమిళ స్టార్ హీరో సూర్య న‌టిస్తోన్న 'ఆకాశమే నీ హద్దురా' చిత్రంలో కీల‌క పాత్ర పోషిస్తున్నారు. ఈ  చిత్రంలో తన పాత్రకు సంబంధించిన లుక్‌ను మోహన్ బాబు ట్వీట్ చేశారు. ఎయిర్ ఫోర్స్ ఉన్న‌తాధికారిగా మోహ‌న్ బాబు ప‌వ‌ర్ ఫుల్ లుక్  సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది.
`ఆకాశ‌మే నీ హ‌ద్దురా`సినిమాలో సూర్యా గురువుగా మోహ‌న్ బాబు కీ రోల్ ప్లే చేశార‌ట‌. ఈ సినిమాలో మోహ‌న్ బాబు మాస్ మెరుపులు మెరిపించి మురిపించార‌ని కితాబిస్తూ సూర్య‌ కూడా ట్వీట్ చేశాడు. ```ఆకాశ‌మే నీ హ‌ద్దురా`సినిమాలో తనదైన శైలితో మరపురాని మాస్ ఉరుములు మెరుపులు కురిపించి మమ్మల్ని మురిపించిన మా మంచి మంచు భక్తవత్సల నాయుడు గారికి మా సెల్యూట్ `` అంటూ సూర్య ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ తో పాటు క్యాప్, ఎయిర్ ఫోర్స్ యూనిఫార్మ్ లో ఉన్న మోహ‌న్ బాబు ప‌వ‌ర్ ఫుల్ ఫొటోను కూడా ట్వీట్ చేశాడు. ప్ర‌స్తుతం మోహ‌న్ బాబు లుక్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.
త‌మిళ‌నాడుకు చెందిన కెప్టెన్ గోపీనాథ్ జీవిత క‌థ ఆధారంగా `ఆకాశ‌మే నీ హ‌ద్దురా`ను గురు ఫేమ్ సుధా కొంగర దర్శకత్వం తెర‌కెక్కిస్తున్నారు.  రూపొందుతున్న సినిమా ఇది. కోటి ఆశ‌ల‌తో ప‌ల్లెటూరు నుంచి ప‌ట్నం వ‌చ్చిన ఓ సాదా సీదా వ్య‌క్తి....ఏకంగా ఎయిరోప్లేన్ కంపెనీని ఎలా స్థాపించాడ‌న్న‌దే ఈ చిత్ర క‌థాంశం. గోపీనాథ్ పాత్ర‌లో సూర్య న‌టించిన‌ ఈ చిత్రంలో సూర్య గురువు పాత్ర‌లో మోహ‌న్ బాబు ఒదిగిపోయార‌ట‌. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. తమిళంతోపాటు తెలుగులో ఏప్రిల్ 9న ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్నారు.