ఆమె కొంటెతనానికి అందరూ ఫిదా !!

August 07, 2020

హీరో సూర్య పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఆకాశం నీ హద్దురా ... కాటుక కనులే పాట విజువల్ ట్రీట్ అని చెప్పొచ్చు. మాంచి రసభరితంగా తెరకెక్కించిన ఈ పాటలో అపర్ణ బాలమురళి కొంటెతనం, ఎక్స్ ప్రెషన్స్ హైలైట్. 

జి.వి.ప్రకాష్ శ్రావ్యమైన ట్యూన్ కట్టారు ఈ పాటకు. భాస్కరభట్ల సాహిత్యం చాలా వినసొంపుగా ఉంది. సంగీత సాహిత్యాల పరంగా చూసినా, నటీనటుల పరంగా చూసినా ఈ పాట ఆహ్లాదకరంగా ఉంది.

సూర్య అమ్మాయికి సైటు కొట్టడం, అతన్ని ఇగ్నోర్ చేస్తున్నట్టే చేస్తూ అతనిపై అపర్ణ బాలమురళి తన చూపులతో రక్తికట్టించారు. అతని కోసం వెతికే ఆ కళ్లు, అవి పలికే భావం అద్భుతంగా ఉంది. వీరిద్దరి కెమిస్ట్రీ అదిరిపోయింది.

ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి రెండు పాటలు మంచి ఆదరణ పొందాయి. ఇది తాజా సంచలనం.

సుధ కొంగర... దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మోహన్ బాబు కీలక పాత్ర పోషిస్తున్నారు.